బిగ్ రిలీఫ్: హార్దిక్ పాండ్యా, రాహుల్ పై నిషేధం ఎత్తివేత

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.

  • Published By: sreehari ,Published On : January 24, 2019 / 01:14 PM IST
బిగ్ రిలీఫ్: హార్దిక్ పాండ్యా, రాహుల్ పై నిషేధం ఎత్తివేత

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. పాండ్యా, రాహుల్ పై రెండు వారాల నిషేధం అనంతరం గురువారం బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) వారిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. హార్దిక్, రాహుల్ సస్పెన్షన్ పెండింగ్ పై విచారణ చేపట్టిన సీఓఏ పాలకుల కమిటీ.. కొత్త న్యాయసలహాదారుడు పీఎస్ నరసింహాను సంప్రదించింది. స్వతంత్ర న్యాయాధికారి పీఎస్ నరసింహాతో చర్చించిన అనంతరం ఆయన సూచన మేరకు తక్షణమే హార్దిక్ పాండ్యా, రాహుల్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఓఏ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్ టూర్ లో టీమిండియాతో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు రాహుల్.. దేశీయవాళీ క్రికిట్ లో ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న హోం సిరీస్ లో ఇండియా ఏ తరపున ఆడే అవకాశం ఉంది. పాండ్య, రాహుల్ క్రికెట్ భవితవ్యంపై నిర్ణయాన్ని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జి బీసీసీఐ పాలకుల కమిటీకే వదిలేశారు. బీసీసీఐ (రూల్ 46) క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరు ఆటగాళ్లపై సస్పెన్షన్ విధించినట్టు సీఈఏ పేర్కొంది. అయితే పాండ్య, రాహుల్ పై సస్పెన్షన్‌ విధించడం సరైంది కాదంటూ గతవారం బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా పాలకుల కమిటీకి లేఖ రాశారు. వారిపై వేటు వేయడం వల్ల టీమిండియా ఖ్యాతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఖన్నా అభిప్రాయపడ్డారు. 

ఇటీవల కాఫీ విత్ కరన్ అనే హిందీ టీవీషోలో హార్దిక్, రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిపై విమర్శలు వెల్లువెత్తాయి. పాండ్య, రాహుల్ బహిరంగ క్షమాపణలు కోరినప్పటికీ బీసీసీఐ వేటు వేసింది. ఈ నిషేధంతో వీరిద్దరూ టీమిండియాలో చోటు కోల్పోయి ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇంటిముఖం పట్టారు.