హాంకాంగ్ ఓపెన్: సైనా అవుట్, సెకండ్ రౌండ్‌లోకి సింధు

హాంకాంగ్ ఓపెన్: సైనా అవుట్, సెకండ్ రౌండ్‌లోకి సింధు

Updated On : November 13, 2019 / 12:03 PM IST

భారత షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ 2019లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్లో దక్షిణకొరియా కిమ్ గా యూన్ తో తలపడి 21-15, 21-16తేడాతో గేమ్ గెలిచింది. తొలి రోజు భాగంగా జరిగిన పోటీల్లో సింధూ సెకండ్ రౌండ్లోకి ప్రవేశించగా, సైనా చైనాకు చెందిన కౌ యాన్ యాన్ తో తలపడి 13-21, 20-22తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

ప్రపంచ తొమ్మిదో ర్యాంకు ప్లేయర్ అయిన సైనా పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. గడిచిన ఆరు టోర్నమెంట్లలో ఐదింటిలో తొలి రౌండ్లోనే తప్పుకుంది. కాగా, చైనాకు చెందిన కై యాన్ యాన్ తో వరుసగా రెండో సారి ఓడిపోయింది. గేమ్ ఆసాంతం పోటాపోటీగా సాగినప్పటికీ చైనీస్ ప్లేయర్ విసిరిన ఛాలెంజ్ ఎదుర్కోలేకపోయింది. 

పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మకు నిరాశ తప్పలేదు. తైవాన్ కు చెందిన జు వీ వాంగ్ చేతిలో 11-21, 21-13, 8-21తేడాతో ఓడిపోయాడు.