Neeraj Chopra : నీరజ్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

నీరజ్ చోప్రాకోసం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్ కి ముందు 450 రోజులు విదేశాల్లో శిక్షణ పొందారు చోప్రా. ఈ శిక్షణకి, ఒలింపిక్స్ లో పాల్గొనడానికి రూ.4,85,39,638 ఖర్చు చేసింది. ఇక 2019లో నీరవ్ చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్ గా డా. క్లాస్ బార్టోనియెడ్జ్ నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1,22,24,880 చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్ లకు రూ. 4,35,000 ఖర్చు చేసింది.

Neeraj Chopra : నీరజ్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

Neeraj Chopra (2)

Updated On : August 9, 2021 / 7:24 AM IST

Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణపతకం అందించి వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికారు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ లో జావలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల దూరం విసిరి కొత్త చరిత్ర లికించారు. చోప్రా బంగారం పతకం గెలిసిన వేళ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి, ప్రధానితోపాటు దేశ ప్రజలు చోప్రాను అభినందించారు. ఈ పతకం సాధించడం కోసం చోప్రా పడిన కష్టం చాలానే ఉంది.. చోప్రా ట్యాలెంటును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించింది.

నీరజ్ చోప్రాకోసం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్ కి ముందు 450 రోజులు విదేశాల్లో శిక్షణ పొందారు చోప్రా. ఈ శిక్షణకి, ఒలింపిక్స్ లో పాల్గొనడానికి రూ.4,85,39,638 ఖర్చు చేసింది. ఇక 2019లో నీరవ్ చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్ గా డా. క్లాస్ బార్టోనియెడ్జ్ నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1,22,24,880 చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్ లకు రూ. 4,35,000 ఖర్చు చేసింది.

ఒలింపిక్స్ కి కొద్దీ రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్ లో ఉన్నారు. ఇందుకోసం రూ. 19,22,533 లను ఖర్చు చేసింది. మెరుగైన క్రీడాకారులకు కేంద్ర వెన్నుదన్నుగా నిలవడంతో అందుకు ప్రతిఫలంగా వారు పతకాలు తెచ్చిపెట్టారు.