BJP MP Brij Bhushan Singh : మహిళా రెజ్లర్లను కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ ఏం చెప్పారంటే…
మహిళా రెజ్లర్ల కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ సింగ్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అవుట్‌గోయింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టు ముందు లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను తాను సమర్థించుకున్నారు....

BJP MP Brij Bhushan Singh
BJP MP Brij Bhushan Singh : మహిళా రెజ్లర్ల కౌగిలించుకోవడంపై బ్రిజ్ భూషణ్ సింగ్ కోర్టులో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అవుట్‌గోయింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోర్టు ముందు లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను తాను సమర్థించుకున్నారు. (Wrestling body chief to court) ‘‘హగ్గింగ్… నేరపూరిత శక్తి లేదా లైంగిక ఉద్ధేశం లేకుండా స్త్రీని తాకడం నేరం కాదు’’ అని బ్రిజ్ భూషణ్ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు.
Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదించిన న్యాయవాది రాజీవ్ మోహన్ కూడా బీజేపీ ఎంపిపై మహిళా రెజ్లర్ల ఆరోపణలకు కాలపరిమితి లేదని వాదించారు. రెజ్లింగ్ ఈవెంట్‌లలో ఎక్కువగా మగ కోచ్‌లు ఉంటారని న్యాయవాది చెప్పారు. మహిళా రెజ్లర్ల విజయం కోసం వారిని మగ కోచ్ కౌగిలించుకోవడం (Hugging woman) సాధారణమేనని న్యాయవాది చెప్పారు.
Woman Cheating : వితంతువుగా నటించి పదేళ్లుగా తండ్రి పెన్షన్ పొందుతున్న కూతురు
అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ముందు న్యాయవాది వాదిస్తూ మంగోలియా, జకార్తాలో జరిగిన సంఘటనలపై విచారణ భారతదేశంలో జరగదన్నారు. సీఆర్‌పీసీని ఉటంకిస్తూ సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడ విచారణ జరగాలని అన్నారు. బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది ఫిర్యాదుల సమయం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. 2017, 2018సంవత్సరాల్లో జరిగిన ఆరోపించిన సంఘటనల ఆధారంగా 2023లో ఫిర్యాదు దాఖలైందని న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు.
Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం
కర్ణాటకలోని బళ్లారి లేదా యూపీలోని లక్నోలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీలో విచారణ జరపడం సాధ్యం కాదని బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది చెప్పారు. దీనిపై కోర్టు గురువారం విచారణ కొనసాగించనుంది. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 20న బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రిజ్ భూషణ్ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు కోరింది.