field umpire call : డీఆర్‌ఎస్‌లో ఫీల్డ్ అంపైర్ కాల్‌పై ఐసీసీ క్లారిటీ
డీఆర్‌ఎస్‌లో అంపైర్స్ కాల్ నిబంధన తొలగించే ప్రసక్తే లేదని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. గ్రౌండ్‌లో ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విలువను కాపాడేందుకు అంపైర్స్ కాల్ చాలా అవసరమని, అందుకే దానిని తొలగించే అవకాశమే లేదని అనిల్ కుంబ్లే చెప్పారు

Field Umpire Call
ICC clarifies field umpire call in DRS : డీఆర్‌ఎస్‌లో అంపైర్స్ కాల్ నిబంధన తొలగించే ప్రసక్తే లేదని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. అంపైర్ కాల్స్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వెళ్లువెత్తుతున్న టైమ్‌లో ఐసీసీ అధ్యక్షుడు అనిల్ కుంబ్లే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన.. మీటింగ్ గొప్పగా జరిగిందని, ఈ సమావేశంలో డీఆర్‌ఎస్‌లోని అంపైర్స్ కాల్ విషయంలో జరుగుతున్న చర్చ గురించి సుదీర్ఘంగా చర్చించామని కుంబ్లే తెలిపారు.
గ్రౌండ్‌లో ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విలువను కాపాడేందుకు అంపైర్స్ కాల్ చాలా అవసరమని, అందుకే దానిని తొలగించే అవకాశమే లేదని అనిల్ కుంబ్లే చెప్పారు. అయితే.. డీఆర్‌ఎస్ విషయంలో ఐసీసీ మూడు మార్పులను మాత్రం చేసింది. అందులో మొదటిది.. LBWలో వికెట్ల టాప్ మార్జిన్‌ను పెంచింది. అంతేకాక.. ఫీల్డింగ్ జట్టు ఎల్బీపై రివ్యూకు వెళ్లడానికి ముందే ఆ బ్యాట్స్‌మన్ నిజంగానే బంతిని ఆడే ప్రయత్నం చేశాడా? లేదా? అని అంపైర్‌తో చెక్ చేసుకోవచ్చు. ఇకపై షార్ట్ రన్‌ను కూడా థర్డ్ అంపైర్ నిర్ణయించనున్నాడు.