IND vs NZ Odi : న్యూజిలాండ్ పై భార‌త్ విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వ‌రుస‌గా ఐదో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs NZ Odi : న్యూజిలాండ్ పై భార‌త్ విజ‌యం

IND vs NZ

Updated On : October 22, 2023 / 10:14 PM IST

 భార‌త్ విజ‌యం
274 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 48 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

40 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 225/5
భార‌త ఇన్నింగ్స్‌లో 40 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. ఐదు వికెట్లు కోల్పోయిన భార‌త్ 225 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ(71), ర‌వీంద్ర జ‌డేజా (17) లు ఆడుతున్నారు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ర‌నౌట్‌..
విరాట్ కోహ్లీతో స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా సూర్య‌కుమార్ యాద‌వ్ (2) ర‌నౌట్ అయ్యాడు. దీంతో 33.5వ ఓవ‌ర్‌లో 191 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ
మిచెల్ సాంట్న‌ర్ బౌలింగ్‌లో (32.6వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి కోహ్లీ 60 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

కేఎల్ రాహుల్ ఔట్‌..
మిచెల్ సాంట్న‌ర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (27; 35 బంతుల్లో 3 ఫోర్లు) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 32.1వ ఓవ‌ర్‌లో 182 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది.

30 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 174/3
భార‌త ఇన్నింగ్స్‌లో 30 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ల న‌ష్టానికి టీమ్ఇండియా 174 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (42), కేఎల్ రాహుల్ (19) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో కాన్వే క్యాచ్ అందుకోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (33; 29 బంతుల్లో 6 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 21.3వ ఓవ‌ర్‌లో 128 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 121/2
భార‌త ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్ల న‌ష్టానికి టీమ్ఇండియా 121 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (28), విరాట్ కోహ్లీ(20) లు ఆడుతున్నారు.

స్టేడియాన్ని కమ్మేసిన పొగమంచు.. ఆగిన మ్యాచ్‌
ధ‌ర్మ‌శాల స్టేడియాన్ని పొగ‌మంచు క‌మ్మేడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి 15.4 ఓవ‌ర్ల‌లో భార‌త్ 100/2 స్కోరుతో నిలిచింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (21), విరాట్ కోహ్లీ (7) లు క్రీజులో ఉన్నారు.

శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ (26; 31 బంతుల్లో 5 ఫోర్లు) మిచెల్ చేతికి చిక్కాడు. దీంతో 13.2వ ఓవ‌ర్‌లో 76 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ మిస్‌..
ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ (46; 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 11.1 ఓవ‌ర్‌లో 71 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

6 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 36/0
ల‌క్ష్య ఛేద‌న‌లో రోహిత్ శ‌ర్మ దూకుడుగా ఆడుతున్నాడు. భార‌త ఇన్నింగ్స్‌లో 6 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్ట‌పోకుండా భార‌త్ 36 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (11), రోహిత్ శ‌ర్మ (25) లు ఆడుతున్నారు.

టీమ్ఇండియా విజ‌య ల‌క్ష్యం 274
మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేడంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 273 ప‌రుగులు చేసి ఆలౌటైంది.  ర‌చిన్ ర‌వీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, బుమ్రా లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన ష‌మీ..
మ‌హ్మ‌ద్ ష‌మీ ఓకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. 48వ ఓవ‌ర్‌ను వేసిన ష‌మీ వ‌రుస బంతుల్లో మిచెల్ సాంట్నర్ (1), మాట్ హెన్రీ (0) ల‌ను ఔట్ చేశాడు. దీంతో 260 ప‌రుగుల వ‌ద్ద న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

గ్లెన్ ఫిలిప్స్ ఔట్‌..
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ గ్లెన్ ఫిలిప్స్ (23; 26 బంతుల్లో 1 సిక్స్‌) రోహిత్ శ‌ర్మ చేతికి చిక్కాడు. దీంతో 44.2వ ఓవ‌ర్‌లో 243 ప‌రుగుల వ‌ద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది.

డారిల్ మిచెల్ సెంచరీ
బుమ్రా బౌలింగ్‌లో(40.4వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి డారిల్ మిచెల్ 100 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో సెంచరీ చేశాడు.

లాథ‌మ్ ఔట్‌..
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో కెప్టెన్ టామ్ లాథ‌మ్ (5) ఎల్భీడ‌బ్య్లూగా ఔట్ అయ్యాడు. దీంతో 36.5 ఓవ‌ర్‌లో 205 ప‌రుగుల వ‌ద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.

ర‌చిన్ ర‌వీంద్ర ఔట్‌..
న్యూజిలాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో ర‌చిన్ ర‌వీంద్ర (75 87 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 33.3వ ఓవ‌ర్‌లో 178 ప‌రుగుల వ‌ద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది.

మిచెల్ అర్థ‌శ‌త‌కం
మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ (26.6వ ఓవ‌ర్‌)తీసి 60 బంతుల్లో డారిల్ మిచెల్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా.. వ‌న్డేల్లో అత‌డికి ఇది ఐద‌వ అర్థ‌శ‌త‌కం 27 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 131/2. డారిల్ మిచెల్‌(50), ర‌చిన్ ర‌వీంద్ర (59) లు ఆడుతున్నారు.

ర‌చిన్ ర‌వీంద్ర హాఫ్ సెంచరీ
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో(22.3వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి ర‌చిన్ ర‌వీంద్ర 56 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 23 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 110/2. డారిల్ మిచెల్ (38), ర‌చిన్ ర‌వీంద్ర (50) లు ఆడుతున్నారు.

15 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 61/2
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొద‌టి 15 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్ల న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. డారిల్ మిచెల్ (14), ర‌చిన్ ర‌వీంద్ర (26) లు ఆడుతున్నారు.

విల్ యంగ్ ఔట్‌..
న్యూజిలాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో విల్ యంగ్ (17; 27 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 8.1వ ఓవ‌ర్‌లో 19 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

డేవాన్ కాన్వే డ‌కౌట్‌
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జ‌ట్టుకు షాక్ త‌గిలింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో డేవాన్ కాన్వే (0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో 3.3వ ఓవ‌ర్‌లో 9 ప‌రుగుల వ‌ద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ తుది జ‌ట్టు : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

IND vs NZ : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్ జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సార్లు ఇరు జ‌ట్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఐదు మ్యాచుల్లో న్యూజిలాండ్‌, మూడు మ్యాచుల్లో టీమ్ఇండియా గెలిచింది.