ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి..

వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ’దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈపాటలో బాలీవుడ్ హీరోలు రణ్‌వీర్ సింగ్‌తో పాటు చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు.

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి..

ICC World Cup 2023

Updated On : September 20, 2023 / 1:53 PM IST

ICC World Cup 2023 Official Anthem : అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మెగా టోర్నీకోసం ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ’దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈ పాటలో బాలీవుడ్ హీరోలు రణ్‌వీర్ సింగ్‌తో పాటు చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు. శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం అందించగా.. ప్రీతమ్ సంగీతం అందించారు.

Shaheen Shah Afridi Wedding: షాహీన్ అఫ్రిదీ పెళ్లిలో పాక్ కెప్టెన్ బాబర్ సందడి.. బిగ్ హగ్‌తో స్వాగతం.. వీడియోలు వైరల్

రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం రూపొందించిన సాంగ్‌లో భాగం కావడం నిజంగా గౌరవం అన్నారు. ఇది ఒక వేడుక. మనందరం ఇష్టపడే క్రీడ అని అన్నారు. సంగీతకారుడు ప్రతీమ్ మాట్లాడుతూ.. ఈ పాట కంపోజ్ చేయడం నాకు గొప్ప గౌరవం అన్నారు. ఈ పాట 1.4 బిలియన్ భారతీయ అభిమానులకు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారత్‌కు వచ్చి అతిపెద్ద వేడుకలో భాగం కావాలని అన్నారు. ఇదిలాఉంటే అక్టోబర్ 5న ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో మెగా‌టోర్నీ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ మొదటి మ్యాచ్ ఆడుతుంది.