Kohli- KL Rahul: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దుమ్ము రేపిన కోహ్లి, కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మకు షాక్

టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు.

Kohli- KL Rahul: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దుమ్ము రేపిన కోహ్లి, కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మకు షాక్

Virat Kohli, KL Rahul (Photo @BCCI)

Updated On : October 11, 2023 / 5:59 PM IST

Kohli- KL Rahul ODI Rankings: ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపారు. కోహ్లి ఒక స్థానం మెరుగుపరుచుకుని 7వ ర్యాంక్ లో నిలిచాడు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ 97 పరుగులతో రాణించిన రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మ‌న్ గిల్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరిద్దరికీ 5 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. వైరల్ ఫీవర్ కారణంగా ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచ్ లకు శుభ్‌మ‌న్ గిల్ దూరమయ్యాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో అతడు ఆడే అవకాశముందని అంటున్నారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది.

రోహిత్ శర్మకు షాక్
వన్డే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ తగిలింది. హిట్ మాన్ టాప్ 10 నుంచి కిందకు పడిపోయాడు. ఒక స్థానం దిగజారి 11వ ర్యాంక్ లో నిలిచాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లాండ్ ఓపెన‌ర్ డేవిడ్ మలాన్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ డెర్ డస్సెన్ 3, ఐర్లాండ్ ఆటగాడు హ్యరీ టెక్టర్ 4, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

Also Read: పాక్ ఆట‌గాళ్లు బౌండ‌రీ లైన్‌ను మార్చారా..? సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్‌..?

కుల్దీప్ యాదవ్ జంప్
బౌలింగ్ ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేవు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 2వ ర్యాంక్ లో ఉన్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకస్థానం మెరుగు పరుచుకుని 8వ ర్యాంక్ లో నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) 3, ముజీబ్ ఉర్ రెహమాన్ (అఫ్గానిస్థాన్‌) 4, మాట్ హెన్రీ (న్యూజిలాండ్) 5 ర్యాంకుల్లో కంటిన్యూ అవుతున్నారు.

Latest ICC ODI batsmen rankings

Latest ICC ODI Rankings (Image Source: ICC)