Team India : అప్పుడు, ఇప్పుడు విల‌న్ ఆస్ట్రేలియానే.. భార‌త్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

టీమ్ఇండియా ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ముద్దాల‌ని భావించ‌గా ఆస్ట్రేలియా అడ్డుప‌డింది

Team India : అప్పుడు, ఇప్పుడు విల‌న్ ఆస్ట్రేలియానే.. భార‌త్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

Rohit- Ganguly

టీమ్ఇండియా ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ముద్దాల‌ని భావించ‌గా ఆస్ట్రేలియా అడ్డుప‌డింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఆరోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర‌కు వ‌రుస మ్యాచుల్లో గెలుపొందిన టీమ్ఇండియా ఆఖ‌రి మ్యాచ్‌లో చ‌తికిల ప‌డింది.

క‌నీసం పోరాటం కూడా చేయ‌లేదు. మొద‌ట బ్యాట‌ర్లు చేతులెత్తేయ‌గా ఆ త‌రువాత బౌల‌ర్లు కూడా అద్భుతాలేమీ చేయ‌లేదు. దీంతో భార‌త్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో భార‌త్ ఓడిపోవ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ఓడిపోయింది.

2003లో ఫైన‌ల్‌లో ఏం జ‌రిగిందంటే..?

వన్డే వరల్డ్‌కప్‌ 2003 ఫైనల్ మ్యాచ్‌ జోహన్నెస్‌బర్గ్ వేదికగా జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు పోటీప‌డ్డాయి. టాస్ గెలిచిన గంగూలీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 359 ప‌రుగులు చేసింది. అప్ప‌టి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ భార‌త బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు. 121 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది 140 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. అత‌డికి తోడు మార్టిన్ 88 నాటౌట్‌, ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ 57, మాథ్యూహెడెన్ 37 రాణించ‌డంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.

Shubman Gill : ఇది గ‌మ‌నించారా..? అప్పుడు స‌చిన్‌.. ఇప్పుడు గిల్‌.. మామా అల్లుడు మీమ్స్‌తో హల్‌చల్

భార‌త బౌల‌ర్లు ఎక్స్‌ట్రాల‌ రూపంలో 37 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్ 39.2 ఓవ‌ర్ల‌లో 234 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో 125 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓడిపోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో వీరేంద్ర సెహ్వాగ్ 82, రాహుల్ ద్ర‌విడ్ 47 లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో భార‌త్‌కు దారుణ ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.

20 ఏళ్ల త‌రువాత 2023లో..

20 ఏళ్ల త‌రువాత భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు రెండోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్‌) కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్‌వుడ్, పాట్ క‌మిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్‌, జంపాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

World Cup final : ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ల‌క‌లం.. కాసేపు ఆగిపోయిన మ్యాచ్‌.. ఏం జ‌రిగిందంటే..?

ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ల‌క్ష్యాన్ని ఆసీస్ 241 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ వార్న‌ర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)లు విఫ‌లమైన ల‌బుషేన్ (58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) హాప్ సెంచ‌రీతో రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ, సిరాజ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈమ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు 18 ఎక్స్‌ట్రాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

విల‌న్ ఆస్ట్రేలియానే..

భార‌త్ గెలిచిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థులు వెస్టిండీస్‌, శ్రీలంక కాగా.. 2003లోగానీ, 2023లోగానీ క‌ప్పును ముద్దాడాల‌న్న టీమ్ఇండియా క‌ల‌ను దూరం చేసింది ఆస్ట్రేలియానే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ లెక్క‌న భార‌త్ మ‌రోసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాలంటే ఆసీస్ ఫైన‌ల్‌కు రావొద్దు అని అభిమానులు కోరుకుంటున్నారు.