తొలిటీ20 : అదరగొట్టిన అయ్యర్.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 125

తొలిటీ20 : అదరగొట్టిన అయ్యర్.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 125

Ind Sets Target To England 125 Runs In 1st T20

Updated On : March 12, 2021 / 9:13 PM IST

IND sets target to England 125 runs : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 125 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా దిగిన శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ ఆదిలోనే చేతులేత్తేశారు.

ధావన్ (4), రాహుల్ (1) పరుగుతోనే పెవిలియన్ బాటపట్టారు. కోహ్లీసేనలో శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సు) 67 హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే చేతులేత్తేశారు.


కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), రిషబ్ పంత్ (0), రిషబ్ పంత్ (21), హార్దిక్ పాండ్యా (19), షార్దూల్ ఠాకూర్ (0) పరుగులకే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసుకోగా, రషీద్, వుడ్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.