IND vs AUS 1st T20 : విశాఖలో విజయం మనదే.. ఆసీస్ పై భారత్ విజయం
IND vs AUS 1st T20 : విశాఖలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది.

IND vs AUS 1st T20
టీమ్ఇండియా విజయం
210 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తిలక్ వర్మ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. తన్వీర్ సంఘ బౌలింగ్‌లో స్టోయినిస్ క్యాచ్ అందుకోవడంతో తిలక్ వర్మ (12; 10 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. 15 ఓవర్లకు భారత స్కోరు 155/4. రింకూ సింగ్ (1), సూర్యకుమార్ యాదవ్ (56)లు ఆడుతున్నారు.
సిక్స్‌తో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ
సీన్ అబాట్ బౌలింగ్‌లో(13.2వ ఓవర్‌లో) సిక్స్ కొట్టి 29 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Leading from the front & how! ? ?
Suryakumar Yadav notches up a cracking FIFTY on his captaincy debut! ? ?#Teamindia 144/3 after 14 overs in the chase.
Follow the match ▶️ https://t.co/T64UnGxiJU#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/cy1hSwWWOY
— BCCI (@BCCI) November 23, 2023
ఇషాన్ కిషన్ అర్ధశతకం.. ఆ వెంటనే ఔట్
తన్వీర్ సంఘ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 37 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మాథ్యూ షార్ట్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్ (58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 12.3వ ఓవర్‌లో భారత్ 134 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
5⃣8⃣ Runs
3⃣9⃣ Balls
2⃣ Fours
5⃣ Sixes@ishankishan51 departs but not before he scored a breezy & stroke-filled half-century in the chase!Follow the match ▶️ https://t.co/T64UnGxiJU #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/G7gRcvR1P9
— BCCI (@BCCI) November 23, 2023
10 ఓవర్లకు భారత స్కోరు 106/2
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు భారత స్కోరు 106/2. సూర్యకుమార్ యాదవ్ (40), ఇషాన్ కిషన్ (39) లు ఆడుతున్నారు.
జైస్వాల్ ఔట్..
మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (21; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 2.3వ ఓవర్‌లో 22 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రుతురాజ్ రనౌట్..
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్ఇండియా బరిలోకి దిగింది. మొదటి ఓవర్ స్టోయినిస్ వేయగా మొదటి బంతికే ఫోర్ కొట్టిన జైస్వాల్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. కాగా.. ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ (0) రనౌట్ అయ్యాడు. 1 ఓవర్‌కు భారత స్కోరు 12/1. జైస్వాల్ (11), ఇషాన్ కిషన్ (1) లు క్రీజులో ఉన్నారు.
టీమ్ఇండియా టార్గెట్ 209
జోష్ ఇంగ్లిస్ (110) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (52) హాఫ్ సెంచరీ చేశాడు. మాథ్యూ షార్ట్ (13) విఫలమైనా ఆఖర్‌లో టిమ్ డేవిడ్ (19 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
Innings Break!
Australia post 208/3 on the board.
Over to #TeamIndia batters now ? ?
The chase coming up shortly. ⌛️
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/HzNYrOpgFf
— BCCI (@BCCI) November 23, 2023
జోష్ ఇంగ్లిష్ సెంచరీ
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో (16.4వ ఓవర్‌లో) ఫోర్ కొట్టి 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు జోష్ ఇంగ్లిస్. అయితే.. ప్రసిద్ధ్ కృష్ణ వేసి ఆ మరుసటి ఓవర్‌లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడంతో జోష్ ఇంగ్లిస్ (110; 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఔట్ అయ్యాడు.
Josh Inglis equals Australia’s fastest-ever Men’s T20I century in Visakhapatnam ?#INDvAUS pic.twitter.com/9SGWO7iP93
— ICC (@ICC) November 23, 2023
స్టీవ్‌స్మిత్ హాఫ్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్(52; 41 బంతుల్లో 8 ఫోర్లు) ఆ మరుసటి బంతికే రనౌట్ అయ్యాడు. దీంతో 15.5 ఓవర్లో 161 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది.
జోష్ ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ
రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో (11.2వ ఓవర్‌లో)సిక్స్ కొట్టి 29 బంతుల్లో జోష్ ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
10 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 83/1
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవర్లకు ఆసీస్ స్కోరు 83/1. జోష్ ఇంగ్లిస్ (44), స్టీవ్ స్మిత్ (24)లు ఆడుతున్నారు.
మాథ్యూ షార్ట్ క్లీన్‌బౌల్డ్..
రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (13; 11 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 4.4వ ఓవర్‌లో 31 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది.
ఆస్ట్రేలియా తుది జట్టు : మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ
భారత తుది జట్టు :
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ
టాస్..
టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
? Toss Update ?
Suryakumar Yadav – on his captaincy debut in international cricket – has won the toss & #TeamIndia have elected to bowl against Australia in the first #INDvAUS T20I.
Follow the match ▶️ https://t.co/T64UnGwKUm @idfc pic.twitter.com/IDej4ADBZK
— BCCI (@BCCI) November 23, 2023
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు టీ20లు అభిమానులకు కనువిందు చేయనున్నాయి. విశాఖ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తొలి టీ20 మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. చాలా కాలం తరువాత విశాఖలో మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.