IND vs AUS 2nd T20 : దంచికొట్టిన మిచెల్ మార్ష్.. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పై ఆసీస్ ఘన విజయం..
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (IND vs AUS 2nd T20) విజయాన్ని సాధించింది.
 
                            IND vs AUS 2nd T20 Australia Won by 4 wickets
IND vs AUS 2nd T20 : మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (46; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (28; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Australia win the second T20I by 4 wickets.#TeamIndia will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/7LOFHGtfXe#AUSvIND pic.twitter.com/rVsd9Md9qh
— BCCI (@BCCI) October 31, 2025
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (68; 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్షిత్ రాణా (35; 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు.
శుభ్‌మన్ గిల్ (5), సంజూ శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబె (4)లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు, మార్కస్ స్టోయినిస్ ఓ వికెట్ తీశాడు.






