IND vs AUS 2nd Test : పింక్ బాల్ టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట.. రిషబ్ పంత్ పైనే మొత్తం భారం!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది.

IND vs AUS 2nd Test Day 2 Stumps India trail by 29 runs
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ (15) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆటలో వీరిద్దరు ఎంత సేపు క్రీజులో ఉంటారు అన్నదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 7 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ జట్టు స్కోరు 12 వద్ద కమిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరికాసేపటికే దూకుడుగా ఆడుతున్న యశస్విజైస్వాల్ (24)ను స్కాట్ బొలాండ్ బుట్టలో వేశాడు.
మరోసారి విరాట్ కోహ్లీ(11) విఫలం కాగా.. కుదురుకున్న శుభ్‌మన్ గిల్ (28)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పొయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, నితీశ్ జోడి మరో వికెట్ పడకుండా రోజును ముగించింది.
అంతక ముందు ఓవర్ నైట్ స్కోరు 86/1 తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 251 పరుగులు జోడించి మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (140) సూపర్ సెంచరీ చేయగా, లబుషేన్ (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆసీస్‌కు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు తీశారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
INDIA 128/5 ON DAY 2 STUMPS.
– India 29 runs behind, Australia ahead in the game. All eyes on Pant 28* (25) and Reddy 15* (14) for tomorrow. 🇮🇳 pic.twitter.com/VQtJ153yaK
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2024