India vs England Test series 2024: ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టు ఇదే.. ఆ ఇద్దరు సీనియర్లకు నో చాన్స్
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

Teamindia
Teamindia Squad : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టు మ్యాచ్ లకు సంబంధించి భారత్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. దాదాపుగా దక్షిణాఫ్రికాతో సిరీస్ లో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ మహ్మద్ షమి జట్టుకు ఎంపిక కాలేదు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అయితే, జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉండటంతో అతను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Also Read : Shaheen Afridi : కెప్టెన్సీ అంటే అంత ఈజీ కాదు..! షహీన్ పై ట్రోలింగ్
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు చోటు దక్కలేదు. వారికి మరోసారి నిరాశే ఎదురైంది. ఇటీవల రంజీ ట్రోఫీలో పుజారా డబుల్ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ లకు పుజారాకు చోటు దక్కుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ సెలెక్టర్లు పుజారాపై నమ్మకం ఉంచలేదు. వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్ కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. బూమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కు తోడుగా కుల్దీప్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Also Read : Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
భారత్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ర్పీత్ బూమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.
- జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
- ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్టణంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
- ఫిబ్రవరి 15 నుంచి 19వ తేదీ వరకు రాజ్ కోట్ మైదానంలో మూడో టెస్టు జరుగుతుంది.
- ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు రాంచీలో నాల్గో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
- మార్చి 7 నుంచి 11వ తేదీ వరకు ధర్మశాలలో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
An action-packed Test series coming ?
Check out #TeamIndia's squad for the first two Tests against England ??#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGP
— BCCI (@BCCI) January 12, 2024