IND vs ENG : టీమ్ఇండియా ఫ్లాన్ అదుర్స్.. మ్యాచ్ మధ్యలో దూబె బదులు హర్షిత్ రాణా ఎలా ఆడాడు ? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
తుది జట్టులో లేని హర్షిత్ రాణా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎలా ఆడాడు. శివమ్ దూబె స్థానంలో అతడిని ఎలా తీసుకున్నారు.

Here is why Harshit Rana is allowed to bowl despite not being part of Team India playing XI
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. శుక్రవారం పూణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్య (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబె (53; 34 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశాడు. జామీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య ఛేదనను ధాటిగానే ఆరంభించిన ఇంగ్లాండ్ పవర్ ప్లే తరువాత గాడి తప్పింది. 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (51; 26 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు), బెన్ డకెట్ (39; 19 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. అయితే.. మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు.
తుది జట్టులోని లేని హర్షిత్ ఎలా ఆడాడంటే?
వాస్తవానికి నాలుగో టీ20 మ్యాచ్ తుది జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ శివమ్ దూబెను తీసుకున్నారు. బ్యాటింగ్ లో దూబె అదరగొట్టాడు. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును హార్దిక్ పాండ్యాతో కలిసి ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే.. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జేమీ ఓవర్టన్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఓ బంతి శివమ్ దూబే తలను బలంగా తాకింది. దీంతో అతడు కంకషన్ కు గురి అయ్యాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి అతడిని పరీక్షించారు. బ్యాటింగ్ కొనసాగించిన అతడు ఆఖరి బంతికి రనౌట్ అయ్యారు.
ఫీల్డింగ్ సమయంలో అతడు మైదానంలోకి రాలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు కంకషన్ గురి అయితే అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మరో ప్లేయర్‌ను ఆడించే అవకాశం ఉంది. దీన్ని భారత జట్టు తెలివిగా ఉపయోగించుకుంది. శివబ్ దూబె స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను బరిలోకి దించింది. ఈ నిర్ణయం భారత్‌కు బాగా కలిసి వచ్చింది. నాలుగు ఓవర్లు వేసిన రాణా మూడు కీలక వికెట్లు తీసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్ టైమ్ గిఫ్ట్..
ఇప్పటికీ కలలగా అనిపిస్తోంది..
తన అంతర్జాతీయ టీ20 అరంగ్రేటం తనకు ఇప్పటికి ఓ కలలా అనిపిస్తోంది మ్యాచ్ అనంతరం హర్షిత్ రాణా మాట్లాడుతూ చెప్పాడు. తనకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే విషయాన్ని ఆలస్యంగా చెప్పారన్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన రెండు ఓవర్ల తరువాత చెప్పారన్నాడు. అవకాశం కోసం తాను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అవకాశం రావడంతో తన సత్తా ఏంటో చూపించాలని అనుకున్నానని, ఐపీఎల్‌లో ఆడడం బాగా కలిసి వచ్చిందన్నాడు. మెరుగ్గా బౌలింగ్ చేయడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.