IND vs ENG Warm Up Game : ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా మ్యాచ్ ర‌ద్దు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 అక్టోబ‌ర్ 5 నుంచి మొద‌లుకానుంది. ఈ క్ర‌మంలో ముందుగా వార్మ‌ప్ మ్యాచులు జ‌రుగుతున్నాయి.

IND vs ENG Warm Up Game : ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా మ్యాచ్ ర‌ద్దు

IND vs ENG Warm Up Game

మ్యాచ్ ర‌ద్దు..

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన వార్మ‌ప్ మ్యాచ్ ర‌ద్దైంది. టాస్ వేసిన త‌రువాత మొద‌లైన వ‌ర్షం ఎంత‌సేప‌టికి త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచులో ప‌రుగుల వ‌ర‌ద చూడొచ్చున‌ని బావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. భార‌త్ త‌న రెండో వార్మ‌ప్ మ్యాచ్‌ను నెద‌ర్లాండ్స్‌తో అక్టోబ‌ర్ 3న ఆడ‌నుంది. ఇక ప్ర‌పంచ‌క‌ప్‌ 2023లో భార‌త్ అక్టోబ‌ర్ 8న త‌న తొలి మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది.

వ‌రుణుడి ఎంట్రీ..

మ్యాచ్ ఆరంభించ‌డానికి సిద్ద‌మౌతుండ‌గా వ‌ర్షం ప‌డుతోంది. దీంతో పిచ్‌పై క‌వ‌ర్ల‌ను క‌ప్పారు. వ‌రుణుడి వ‌ల్ల మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కానుంది.

భారత్ తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్‌ : డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌..

టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ఇండియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

IND vs ENG : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 అక్టోబ‌ర్ 5 నుంచి మొద‌లుకానుంది. ఈ క్ర‌మంలో ముందుగా వార్మ‌ప్ మ్యాచులు జ‌రుగుతున్నాయి. గౌహ‌తి వేదిక‌గా ఇంగ్లాండ్‌తో భార‌త్ వార్మ‌ప్ ఆడ‌నుంది.