IND vs ENG: సర్రుమంటూ దూసుకొచ్చిన బంతి.. జాక్ క్రాలీ బ్యాట్ అడ్డుపెట్టేలోపే స్టంప్స్ లేసిపోయావ్.. ఏమైందో అర్ధంకాక.. వీడియో వైరల్..

మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది...

IND vs ENG: సర్రుమంటూ దూసుకొచ్చిన బంతి.. జాక్ క్రాలీ బ్యాట్ అడ్డుపెట్టేలోపే స్టంప్స్ లేసిపోయావ్.. ఏమైందో అర్ధంకాక.. వీడియో వైరల్..

Crawley

Updated On : August 3, 2025 / 9:02 AM IST

IND vs ENG 5th test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లూ అదరగొట్టడంతో ఇంగ్లాండ్‌కు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. డకెట్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జాక్ క్రాలీ, డకెట్ ఇంగ్లాండ్ కు మంచి శుభారంభాన్ని అందించినప్పటికీ.. మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: ఏంది సామీ ఇట్టా కొట్టావ్.. ఇంగ్లాండ్ బౌలర్ల మతిపోయింది..! గంభీర్‌నే నవ్వించావంటే నువ్వు సూపర్ బ్రో.. వీడియో వైరల్ ..

మూడోరోజు (శనివారం) 75/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగిపోగా.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, జడేజాలు ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రెండురోజు ఆట చివరిలో నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇదిలాఉంటే.. మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ అద్భుత బంతితో క్రాలీని ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతి సర్రుమంటూ దూసుకెళ్లి నేరుగా వికెట్లను తాకింది. క్రాలీ బ్యాట్ అడ్డుపెట్టేలోపే బంతి స్టంప్స్‌ను లేపేసింది.


భారత్ నిర్దేశించిన 374 పరుగులు చేధించే లక్ష్యంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు డకెట్, జాక్ క్రాలీ క్రీజులోకి వచ్చారు. చివరి వరకు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. అయితే, మూడోరోజు ఆటలో చివరి ఓవర్ ను సిరాజ్ వేశాడు. ఈ ఓవర్లో ఐదో బంతిని యార్కర్ వేయగా.. బంతి సర్రుమంటూ దూసుకెళ్లి స్టంప్స్ ను లేపేసింది. క్రీజులో ఉన్న క్రాలీ బ్యాట్ ను అడ్డుపెట్టేలోపే బంతి వికెట్లను తాకింది. దీంతో ఏం జరిగిందో అర్ధంకాక జాక్ క్రాలీ అలానే చూస్తుండిపోయాడు. ఆ తరువాత నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. చివరి రెండు బంతులను ఎదుర్కొని ఉంటే క్రాలీ క్రీజులోనే ఉండవాడు. కానీ, సిరాజ్ అద్భుత బంతితో ఔట్ చేశాడు. దీంతో మూడోరోజు ఆటను భారత్ సంతృప్తిగా ముగించింది.