అయ్యో.. సిరాజ్ భయ్యా ఎంతపనిచేశావయ్యా..! ఒక్క అడుగు ముందుకేసుంటే ఇంగ్లాండ్ పని ఖతమయ్యేది.. వీడియో వైరల్ .. పాపం ప్రసిద్ధ్ ఫేస్ చూశారా..

సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త ..

అయ్యో.. సిరాజ్ భయ్యా ఎంతపనిచేశావయ్యా..! ఒక్క అడుగు ముందుకేసుంటే ఇంగ్లాండ్ పని ఖతమయ్యేది.. వీడియో వైరల్ .. పాపం ప్రసిద్ధ్ ఫేస్ చూశారా..

Mohammed Siraj

Updated On : August 4, 2025 / 7:43 AM IST

IND vs ENG 5th Test Mohammed Siraj : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారింది. అయితే, ఇంగ్లాండ్ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. భారత బౌలర్ల దూకుడు చూస్తుంటే టీమిండియాకు కూడా విజయావకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఆఖరి రోజు ఆటలో (సోమవారం) 35 పరుగులు చేయాలి. అదే టీమిండియా విజయం సాధించాలంటే.. ఇంగ్లాండ్ 35 పరుగులు పూర్తి చేయకముందే నాలుగు వికెట్లు పడగొట్టాలి.. ఒకవేళ వోక్స్ క్రీజులోకి రాకుంటే మూడు వికెట్లు పడగొడితే చాలు.. దీంతో ఆఖరి టెస్టులో విజయం ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మొదట్లో.. చివరిలో అదరగొట్టారు..
నాల్గో రోజును టీమిండియా బాగానే మొదలెట్టింది. మూడోరోజు ఆఖరి బంతికి క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆదివారం ఆకాశ్‌దీప్‌, ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి ఇంగ్లాండ్ బ్యాటర్లపై దాడిని కొనసాగించారు. ప్రసిద్ధ్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయిన డకెట్ (54) రెండో స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి పోప్ (27)ను సిరాజ్ ఔట్ చేశాడు. అయితే, ఆ తరువాత జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) సెంచరీలతో అదరగొట్టారు. వారీ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో భారత్ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. కానీ, చివరిలో జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌లను వెంటవెంటనే ఔట్ చేయడంతో పుంజుకున్న టీమిండియా.. పోటీలోకి వచ్చింది. వర్షం కారణంగా కాస్త ముందుగానే నాల్గోరోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

సిరాజ్ ఆ క్యాచ్ పట్టుంటే..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాల్గోరోజు ఆటలో పెద్ద మిస్టేక్ చేశాడు. ఫలితంగా టీమిండియా ఓటమి అంచుల్లోకి వెళ్లడానికి కారణమైంది. నాల్గో రోజు ఉదయం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడిపోయింది. రూట్, బ్రూక్ లు క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్‌లో ఫుల్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద సౌకర్యంగానే నిలబడ్డ సిరాజ్.. బంతిని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుకున్నాడు. దీంతో టీమిండియా ప్లేయర్లు, ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టారు.

అయితే, సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త బౌండరీ అవతల పడింది. దీంతో ఆ క్యాచ్ కాస్త సిక్స్ గా మారింది. అప్పటికే సంబరాలు చేసుకోవటం మొదలు పెట్టిన బౌలర్ ప్రసిద్ధ్.. సిరాజ్ చేసిన పనికి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సిరాజ్ పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 137/3. ఆ సమయంలో హ్యారీ బ్రూక్ 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో ఉన్నాడు. సిరాజ్ క్యాచ్ మిస్ చేసిన తరువాత బ్రూక్ అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ ఆ క్యాచ్ అందుకొని ఉంటే నాల్గోరోజే టీమిండియా విజయం ఖాయం అయ్యుండేది.