అయ్యో.. అలా చేశావేంటి గిల్.. ఒక్క రన్‌కోసం కొంపముంచావ్ కదయ్యా.. క్రీజులో ఉండిఉంటే.. వీడియో వైరల్

రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్‌మన్ గిల్ రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు.

అయ్యో.. అలా చేశావేంటి గిల్.. ఒక్క రన్‌కోసం కొంపముంచావ్ కదయ్యా.. క్రీజులో ఉండిఉంటే.. వీడియో వైరల్

shubman gill

Updated On : August 1, 2025 / 7:02 AM IST

IND vs ENG 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా గురువారం కీలకమైన ఐదో టెస్టు ప్రారంభమైంది. టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్ కు దిగగా.. ఆది నుంచి వరుస వికెట్లు కోల్పోయి.. గట్టి పరీక్షను ఎదుర్కొంటోంది. మరోపక్క అడపాదడపా కురిసిన వర్షంతో టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మొత్తానికి తొలి రోజు (గురువారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే, సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న శుభ్‌మన్ ఔట్ అయినతీరు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Eng Vs Ind: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. నాయర్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే..

ఓవల్ లో గురువారం భారత బ్యాటర్లను ఇంగ్లాండ్ పేసర్లు పరీక్షించారు. కరుణ్ నాయర్ (52 నాటౌట్) క్రీజులో నిలవకపోతే భారత జట్టు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు పేలవంగా ఆరంభించింది. 38 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాల్గో ఓవర్లోనే భారత్ కు షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండు పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్ బౌలింగ్ లో జైస్వాల్ ఔట్ అయ్యాడు. కొద్దిసేపటికే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ (14) ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్.. సాయి సుదర్శన్ తో కలిసి క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, దురదృష్టవశాత్తూ రన్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.


రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్‌మన్ గిల్ రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. బౌలర్ చేతిలోకే బంతిని కొట్టి గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరంరాగానే సాయి సుదర్శన్ రన్ వద్దంటూ చెప్పడంతో గిల్ వెనుదిరిగి క్రీజులో బ్యాట్ పెట్టేందుకు పరుగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న ఇంగ్లాండ్ బౌలర్ ఆట్కిన్సన్ నేరుగా వికెట్లను హిట్ చేశాడు. దీంతో గిల్ (21) పెవిలియన్ చేరాడు. ఆట్కిన్సన్ వేసిన 28వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గిల్ తొందరపడి లేని రన్‌కు ప్రయత్నించడం వల్ల టీమిండియా కష్టాల్లో పడింది. గిల్ ఆ రన్‌కు ప్రయత్నించకుండా ఉండిఉంటే.. టీమిండియా పటిష్ట స్థితిలో ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ఈ సిరీస్ లో గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు.


గిల్ ఔట్ అయిన తరువాత సాయి సుదర్శన్ (38), జడేజా (9) వెంట వెంటనే ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ ప్లేస్ లో తుది జట్టులో చేరిన ధ్రువ్ జురెల్ (19) సైతం వేగంగా ఆడే ప్రయత్నం ఔట్ అయ్యాడు. కరున్ నాయర్ (52 బ్యాటింగ్), వాసింగ్టన్ సుందర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆటలో వీరు ఎక్కువ సేపు క్రీజులో కుదురుకొని పరుగులు రాబడితే తప్ప.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగుల మార్కును దాటే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.