Eng Vs Ind: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. నాయర్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే..

Eng Vs Ind: ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత తడబడిన భారత్ ఆ తర్వాత నిలబడింది. తొలి రోజు ఆటకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 98 బంతుల్లో 52 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జైస్వాల్ 2 పరుగులే చేసి ఔటయ్యాడు. రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, గిల్ 21, జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్, టంగ్ తలో రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. స్వల్ప పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. 123 పరుగులకే 5 వికెట్లు డౌన్ అయ్యాయి. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో నాయర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఎండ్ లో సుందర్ నిలదొక్కుకున్నాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
Also Read: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. 59 ఏళ్లుగా గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు