భారత టెస్ట్ కెప్టెన్‌గా బుమ్రాకు ఎందుకు అవకాశం దక్కలేదు..? బీసీసీఐ నిర్ణయం వెనుక బిగ్‌ప్లాన్.. మొత్తం చెప్పేసిన బుమ్రా
టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు బీసీసీఐ అప్పగిస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ, శుభ్ మన్ గిల్‍కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇందుకు ప్రధాన కారణం ఉందని బుమ్రా చెప్పారు.

Jasprit Bumrah
Jasprit Bumrah: ఈనెల 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్‌లో జరగనుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. వాస్తవానికి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు బీసీసీఐ అప్పగిస్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యరీతిలో బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు గిల్ కు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో బుమ్రాను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా.. ఆ విషయాలపై జస్ర్పీత్ బుమ్రా క్లారిటీ ఇచ్చాడు.
Also Read: Smriti Mandhana : ఆరేళ్ల తరువాత ఐసీసీ నంబర్ 1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న స్మృతి మంధాన..
ఇంగ్లాండ్‌తో మరో రెండురోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ టీవీ కార్యక్రమంలో భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ తో జస్ర్పీత్ బుమ్రా మాట్లాడాడు. ఈ క్రమంలో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తనకు దక్కకపోవటానికి కారణాన్ని బుమ్రా వివరించాడు. ‘‘పనిభార నిర్వహణలో భాగంగా తానే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకోలేదు. నాయకత్వం కన్నా బౌలింగ్ కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెప్పాను’’ అంటూ బుమ్రా తెలిపారు.
‘‘ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో నా పనిభార నిర్వహణ గురించి చర్చించా. నా వెన్ను పరిస్థితి గురించి సంబంధిత వ్యక్తులతో మాట్లాడా. సర్జన్ ను కూడా సంప్రదించా. పనిభార నిర్వహణ విషయంలో ఎంత తెలివిగా ఉండాలో వాళ్లెప్పుడూ చెబుతుంటారు. వాళ్లతో చర్చించిన అనంతరం కొంచెం తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. ఆ తరువాత బీసీసీఐతో మాట్లాడా. నన్ను కెప్టెన్సీకి పరిగణలోకి తీసుకోవద్దని చెప్పా.’’ అంటూ బుమ్రా తెలిపారు.
ఒకవేళ నాకు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానోలేదో నాకు తెలియదు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మూడు మ్యాచ్ లకు ఒకరు.. రెండు మ్యాచ్ లకు ఒకరు కెప్టెన్ గా ఉండటం జట్టుకు మంచిది కాదు. నేను ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తా… కెప్టెన్సీకి కాదు. అలాఅని నేను కెప్టెన్సీ బాధ్యతలను తక్కువ చేయడం లేదు.. కెప్టెన్సీ గొప్ప గౌరవం. కానీ, నా ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకొని మాత్రమే టెస్టు కెప్టెన్సీకి తనను పరిగణలోకి తీసుకోవద్దని బీసీసీఐకు స్పష్టంగా చెప్పానని బుమ్రా చెప్పారు.