Ind Vs SA : మూడో టెస్టులో రిషభ్ పంత్ వీరోచిత సెంచరీ

కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.

Ind Vs SA : మూడో టెస్టులో రిషభ్ పంత్ వీరోచిత సెంచరీ

Rishabh Pant

Updated On : January 13, 2022 / 7:41 PM IST

Ind Vs SA : కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు. 139 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. పంత్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కోహ్లి(29).. తప్ప ఎవరూ సహకారం అందించకపోయినా సఫారీ బౌలర్లపై పంత్ అటాక్ కు దిగాడు. 6 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ బాదాడు. టీమిండియా లీడ్ ను 200 పరుగులు దాటించాడు.

Corona Treatment : 50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్లు ఖర్చు.. అయినా దక్కని ప్రాణం

కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రత్యర్థి ముందు 212 పరుగుల లక్ష్యం ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌ 13 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్‌ 211 పరుగుల లీడ్‌ సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 57/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు (పుజారా, రహానె) కోల్పోయి కష్టాల్లో పడింది.

Cricketers Affairs: గర్ల్ ఫ్రెండ్స్‌తో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్మెంట్

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్‌ పంత్‌ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించాడు. కోహ్లి చాలా నిదానంగా ఆడాడు. 143 బంతులు ఆడిన కెప్టెన్ కోహ్లి 29 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం (94) నెలకొల్పాడు పంత్. అయితే కోహ్లీ సహా ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పంత్‌ ఆఖరి వరకు నిలకడగా రాణించాడు. సఫారీ జట్టు బౌలర్ల దెబ్బకు మిగతా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎల్‌ రాహుల్ 10, మయాంక్‌ అగర్వాల్ 7, పుజారా 9, రహానె 1, అశ్విన్‌ 7, శార్దూల్‌ ఠాకూర్‌ 5 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు తీశారు. పంత్ 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా… దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది.