Smriti Mandhana : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను (Smriti Mandhana) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

IND W vs SA W Smriti Mandhana 12 Runs Away From Breaking All Time Women ODI Record
Smriti Mandhana : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు (గురువారం అక్టోబర్ 9) భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు విశాఖపట్నంలోని వీసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను (Smriti Mandhana) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
దక్షిణాప్రికాతో మ్యాచ్‌లో మంధాన 12 పరుగులు చేస్తే.. ఓ క్యాలెండర్ ఇయర్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ బెలిండా క్లార్క్‌ను అధిగమిస్తుంది.
Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డే క్రికెట్‌లో అఫ్గాన్ ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
1997లో బెలిండా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించింది. ఆ ఏడాది మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడగా.. 14 ఇన్నింగ్స్‌ల్లో 80.83 సగటు 98.11 స్ట్రైక్‌రేటుతో 970 పరుగులు సాధించింది. ఇందులో మూడు శతకాలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 229 నాటౌట్.
ప్రస్తుతం మంధాన భీకర ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 59.93 సగటుతో 113 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 959 పరుగులు సాధించింది. ఇందులో నాలుగు శతకాలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 135. అయితే.. వన్డే ప్రపంచకప్ 2025లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మంధాన విఫలమైంది. శ్రీలంక పై 8, పాకిస్తాన్ పై 23 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
81 పరుగులు చేస్తే..
2013లో మంధాన అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు 110 మ్యాచ్‌లు ఆడింది. 47.3 సగటుతో 4919 పరుగులు చేసింది. ఇందులో 13 శతకాలు, 32 అర్థశతకాలు ఉన్నాయి. మంధాన మరో 81 పరుగులు సాధిస్తే 5వేల పరుగుల మైలురాయిని చేరుకుంటుంది. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కనుంది.
Yashasvi Jaiswal : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించే అవకాశం..
మిథాలీ రాజ్ (232 మ్యాచ్‌ల్లో 7,805 పరుగులు) మాత్రమే ఇప్పటి వరకు వన్డేల్లో 5వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత మహిళా ప్లేయర్‌గా ఉంది.