ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 11:17 AM IST
ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!

పుల్వామా టెర్రర్ ఎటాక్ తో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకూడదు అంటూ కొందరు.. ఆడాలి అంటూ మరికొందరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ సూనీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై స్పందించారు. వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ను తప్పించాలంటూ బీసీసీఐ ఐసీసీకి చెప్తుందంటూ వార్తలు వస్తుండగా పాకిస్తాన్ ను వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ నుంచి తప్పించడం సాథ్యం కాదని గవాస్కర్ తేల్చి చెప్పేశాడు. వరల్డ్ కప్ నుంచి పాక్‌ను తప్పించాలని బీసీసీఐ ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యమయ్యే పని కాదంటూ ఆయన స్పష్టం చేశాడు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలు కూడా అంగీకరించాలని, వాళ్లు ఒప్పుకునే అవకాశాలు లేవంటూ ఆయన చెప్పారు. ఇది మీ రెండు దేశాల అంతర్గత విషయం..  ఇందులోకి మమ్మల్ని లాగొద్దు అని మిగిలిన దేశాల వాళ్లు అనే అవకాశం ఉందని అలా అంటే పాకిస్థాన్‌ను తప్పించడం సాధ్యం కాదని చెప్పారు. 

అలాగే పాకిస్తాన్ తో వరల్డ్‌కప్‌లో భారత్ ఆడకూడదు అని నిర్ణయం తీసుకుంటే అటువంటి నిర్ణయం వల్ల మనకే నష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే పాక్‌తో భారత్ ఆడకపోతే ఆ జట్టుకు రెండు పాయింట్లు ఉచితంగా ఇచ్చినట్లు అవుతుంది. వరల్డ్‌కప్‌ లాంటి టోర్నీలో రెండు పాయింట్లు వదులుకోవడం మంచిది కాదు.  అందులోనూ పాకిస్తాన్ ను మనం ప్రతీసారీ ఓడించాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆ జట్టును ఓడించడం చాలా ఈజీ అని చెప్పారు. ఆ రెండు పాయింట్లు వాళ్లకు ఇవ్వకూడదు. ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోవడం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. అది చాలు. వరల్డ్‌కప్‌లాంటి టోర్నీలో పాకిస్థాన్ కు అనవసరంగా పాయింట్లు ఇవ్వకూడదు. వాళ్లను ఓడించి సెమీఫైనల్ రాకుండా చేసే సత్తా టీమిండియాకు ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం, దేశం ఏది నిర్ణయిస్తే దానిని స్వాగతిస్తానని, అయితే పాకిస్తాన్ తో ఆడకుంటే మనకే నష్టం అనే విషయాన్ని అభిమానులు గుర్తించాలని సూచించారు. 

అలాగే దేశ ప్రజల మనోభావాల కంటే వరల్డ్‌కప్ ఎక్కువ కాదని, అమరులైన సైనికులకు అండగా ఉండాల్సిన అవసరం ప్రతీ భారతీయుడికి ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతీ దేశం పోరాడవలసిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఇక ఏడాది కాలంగా టీమీండియా క్రికెట్ ఆడుతున్న తీరు ప్రశంసనీయం అని ఇప్పుడు టీమిండియా ఉన్న ఫామ్ లో ఏ దేశాన్నైనా ఢీకొట్టగలదంటూ ఆయన పేర్కొన్నారు.

Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?
Read Also:దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు