మరో సమరం: కివీస్‌తో తొలి వన్డేకు సిద్ధమైన కోహ్లీసేన
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా ఉండనుంది ఈ పర్యటన.

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా ఉండనుంది ఈ పర్యటన.
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా ఉండనుంది ఈ పర్యటన. ప్రపంచ కప్ లోపు మిడిల్ ఆర్డర్ వైఫల్యాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్న టీమిండియాకు ఇది మంచి ప్రాక్టీస్ టోర్నీలా ఉండనుంది.
ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డేల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో మెరిపిస్తున్న ధోనీపైనే అన్నీ ఆశలు పెట్టుకున్న భారత్ మిడిల్ ఆర్డర్‌లో ఆదుకుంటాడనే ఆశాభావంతో ఉంది. కానీ టీమిండియాను న్యూజిలాండ్ సీమింగ్ విభాగంతో బలంగా ఢీకొట్టాలని యత్నిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, ఫెర్గ్యూసన్, టిమ్ సౌతీలు కలిసి కోహ్లీసేనను కట్టడి చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు.
చరిత్రలో న్యూజిలాండ్‌ను వారి గడ్డపైనే భారత్ ఓడించడంలో చాలాసార్లు విఫలమైంది. 35వన్డేలు ఆడిన టీమిండియా కేవలం 10మాత్రమే గెలిచింది.
జనవరి 23 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం ఉదయం 7.30గంటలకు నేపియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మేర భారత జట్టు ఆదివారమే న్యూజిలాండ్ చేరుకుంది. కాగా, మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీ, హాట్ స్టార్, జియో టీవీ, ఎయిర్ టెల్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ఇండియా:
Rohit Sharma, Shikhar Dhawan, Virat Kohli (Captain), MS Dhoni (wicket-keeper), Kedar Jadhav, Dinesh Karthik, Vijay Shankar, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Mohammed Shami, Yuzvendra Chahal, Ambati Rayudu, Shubman Gill, Kuldeep Yadav, Mohammed Siraj, K. Khaleel Ahmed
న్యూజిలాండ్:
Martin Guptill, Colin Munro, Kane Williamson (captain), Ross Taylor, Tom Latham (wicket-keeper), Colin de Grandhomme, Mitchell Santner, Tim Southee, Ish Sodhi, Trent Boult, Lockie Ferguson, Henry Nicholls, Doug Bracewell, Matt Henry.