కామెంటేటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కామెంటేటర్ అవతారమెత్తనున్నాడా.. ఇటీవల టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ఇవ్వకుండానే కామెంటేటర్ అయిపోయాడు. ఇదే తరహాలో మహీ కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తాడని సమాచారం.
ఈ విషయంపై బ్రాడ్ కాస్టర్లు బీసీసీఐకు ప్రతిపాదన పంపారట. బీసీసీఐ అనుమతి ఇవ్వడమే తరువాయి. కామెంటేటర్ గా ధోనీ రెడీ అయిపోయినట్లే. బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అవును, బ్రాడ్‌కాస్టర్లు ప్రతిపాదన పంపారు. కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ అనుమతిస్తే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీని కామెంటేటరి బాక్స్‌లో చూడొచ్చు’ అని తెలిపాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అక్టోబరు 29న డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. నవంబరులో జరగనున్న రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టును డే అండ్ నైట్ టెస్టుగా ఆడేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం బంగ్లా-భారత్ ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. బంగ్లా ఇప్పటికే 1-0ఆధిక్యంతో కొనసాగుతోంది.