IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. కోహ్లీ లేకుండానే బరిలోకి టీమిండియా.. ఇద్దరు యువ ప్లేయర్లు అరంగేట్రం

ఇంగ్లాండ్ జట్టుతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..

IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. కోహ్లీ లేకుండానే బరిలోకి టీమిండియా.. ఇద్దరు యువ ప్లేయర్లు అరంగేట్రం

IND vs ENG 1st ODI

Updated On : February 6, 2025 / 2:10 PM IST

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ప్రారంభమైంది. నాగపూర్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కాగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టీమిండియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తుది జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవటం గమనార్హం. అయితే, ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకు తుది జట్టులోకి తీసుకోలేదని చెప్పారు. మరోవైపు భారత్ జట్టు నుంచి ఇద్దరు యువ ప్లేయర్లు యశస్వీ జైస్వాల్, హర్షిత్ రాణాలు వన్డే ల్లోకి అరంగేట్రం చేశారు.

 

భారత్ తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డెకట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెత్ వెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ , సకిబ్ మహమూద్.


వన్డేల్లో అరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్, హర్షిత్ రాణాలకు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ లు వన్డే క్యాప్ ను అందజేశారు.

 

పంత్ ఔట్.. రాహుల్ ఇన్..
భారత్ తుది జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కూడా చోటు దక్కలేదు. పంత్ స్థానంలో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ తుది జట్టులో చేరాడు. అయితే, బుధవారం మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పంత్, రాహుల్ లో ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. వన్డేల్లో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్, పంత్ లలో ఒకరిని ఎంచుకోవడం ఓ తీయని తలనొప్పి అని రోహిత్ చెప్పారు. కేఎల్ రాహుల్ వన్డేల్లో చాలా యేళ్లుగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.. రిషబ్ పంత్ కూడా ఉన్నారు. వాళ్లిద్దరిలో ఒకరినే ఆడించాల్సిన స్థితిలో ఉన్నాం. ఇద్దరు కూడా మ్యాచ్ లను గెలిపించగలరు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి రావడం ఓ తీయని తలనొప్పి అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. అయితే, ఇవాళ్టి తొలి వన్డేలో కేఎల్ రాహుల్ వైపే రోహిత్ శర్మ మొగ్గారు. పంత్ ను పక్కన పెట్టి జట్టు వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.