IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో టీమ్ఇండియా గెలుపు..

రాంచీ టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో టీమ్ఇండియా గెలుపు..

IND vs ENG 4th Test

టీమ్ఇండియా విజ‌యం
శుభ్‌మ‌న్ గిల్ (52నాటౌట్‌), ధ్రువ్‌జురెల్ (39నాటౌట్‌) రాణించ‌డంతో రాంచీ టెస్టులో భార‌త్ విజ‌యాన్ని అందుకుంది. వీరిద్ద‌రు ఆరో వికెట్ అభేధ్యంగా 72 ప‌రుగులు జోడించి గెలుపును అందించారు. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌కౌట్‌..
షోయ‌బ్ బ‌షీర్ భార‌త్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవ‌ర్‌లో ర‌వీంద్ర జ‌డేజా (4), స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ (0)ల‌ను ఔట్ చేశాడు. దీంతో 120 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది.

లంచ్ బ్రేక్..
నాలుగో రోజు ఆటలో లంచ్ విరామానికి భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 118 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (18), ర‌వీంద్ర జ‌డేజా (3) లు క్రీజులో ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 74 ప‌రుగులు కావాలి.

పాటిదార్ డ‌కౌట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఓలీపోప్ క్యాచ్ అందుకోవ‌డంతో ర‌జ‌త్ పాటిదార్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 26.2 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. 

ఇన్నింగ్స్ 26వ ఓవ‌ర్‌ను టామ్‌హార్డ్లీ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి రోహిత్ శ‌ర్మ (55; 81 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) ఫ్రంట్ పుట్‌కు వ‌చ్చి డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి ట‌ర్న్‌ను అత‌డు అంచ‌నా వేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బాల్ నేరుగా వికెట్ కీప‌ర్ ఫోక్స్ చేతుల్లో ప‌డింది. దీంతో 25.1వ ఓవ‌ర్‌లో 99 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ..
టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీసిన రోహిత్ శ‌ర్మ 69 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 17వ అర్ధ‌శ‌త‌కం. 20 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 91/1. రోహిత్ (52), గిల్ (2) లు క్రీజులో ఉన్నారు.

య‌శ‌స్వి జైస్వాల్ ఔట్‌.. 
జోరూట్ బౌలింగ్‌లో అండ‌ర్స‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో య‌శ‌స్వి జైస్వాల్ (37; 44 బంతుల్లో 5 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 17.3వ ఓవ‌ర్‌లో 84 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

నిల‌క‌డ‌గా ఆడుతున్న ఓపెన‌ర్లు
నాలుగో రోజు భార‌త ఓపెన‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. ఎలాంటి రిస్క్‌ల‌ను తీసుకోవ‌డం లేదు. 14 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 66/0. రోహిత్ శ‌ర్మ (41), య‌శ‌స్వి జైస్వాల్ (25) లు ఆడుతున్నారు. భార‌త విజ‌యానికి 126 ప‌రుగులు అవ‌స‌రం

నాలుగో రోజు ఆట ప్రారంభం..
ఓవ‌ర్ నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ కొన‌సాగించింది. య‌శ‌స్వి జైస్వాల్ (16), రోహిత్ శ‌ర్మ (24) లు క్రీజులో ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 152 ప‌రుగులు అవ‌స‌రం.