Ind Vs SA : భారత్ ఘన విజయం.. సిరీస్ సమం

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Ind Vs SA : భారత్ ఘన విజయం.. సిరీస్ సమం

India Beats South Africa (Photo : Google)

Updated On : December 15, 2023 / 12:28 AM IST

సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చెలరేగింది. దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టీ20 సిరీస్ ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిల్లర్ 35 పరుగులు, మార్క్రమ్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. జడేజా 2 వికెట్లు తీశాడు.

చివరి గేమ్ లో గెలుపుతో 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది.

Also Read : చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ద‌క్షిణాఫ్రికా పై విధ్వంస‌క‌ర సెంచ‌రీ

నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా సూర్య సెంచరీతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సూర్య స్కోరులో ఫోర్ల కంటే సిక్సులే ఎక్కువ ఉన్నాయి. ఈ ‘మిస్టర్ 360’ బ్యాట్స్ మన్ 7 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. జట్టు 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, యశస్వి జైస్వాల్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అటు జైస్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేశాడు.