India Vs Sri Lanka: చెలరేగి ఆడి భారత్‌కు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన శ్రీలంక
భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్‌మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక బ్యాట్స్‌మెన్ మొదటి నుంచీ ధాటిగా ఆడారు.

India vs Sri Lanka Scorecard India Target 207
India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్‌మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక బ్యాట్స్‌మెన్ మొదటి నుంచీ ధాటిగా ఆడారు.
పాథుం నిస్సాంకా 33, కుశాల్ మెండీస్ 52 పరుగులు చేసి, తమ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. భానుక రాజపక్ష 2, చరిత్ అసలంకా 37, డీ సిల్వా 3, దసున్ శనకా 44, హసరంగా 0, చమికా కరుణరత్నే 11 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది.
టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, యజువేంద్ర ఛాహెల్ 1 వికెట్ తీశారు. ఇటీవల జరిగిన తొలి టీ20లో 160 పరుగలకే శ్రీలంక బ్యాట్స్‌మెన్ ను కట్టడి చేసి, విజయం సాధించిన టీమిండియా రెండో టీ20లో మాత్రం భారీ పరుగులు సమర్పించుకుంది. ఇక మ్యాచ్ అంతా టీమిండియా బ్యాట్స్‌మెన్ పైనే ఆధారపడి ఉంది.
Sreeleela: పెళ్లిసందD ఎఫెక్ట్.. హీరోయిన్‌కు ధమాకా.. హీరోకు మాత్రం జీరో!