India Vs Sri Lanka: ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
భారత్, శ్రీలంక మధ్య రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయ్యాడు. దిల్షాన్ మదుశంక బౌలింగ్ లో ధనంజయకు క్యాచ్ ఇచ్చుకుని ఔట్ అయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కరుణరత్నే బౌలింగ్ లో దిల్షాన్ మదుశంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య రాజ్‌కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయ్యాడు. దిల్షాన్ మదుశంక బౌలింగ్ లో ధనంజయకు క్యాచ్ ఇచ్చుకుని ఔట్ అయ్యాడు.
అనంతరం రాహుల్ త్రిపాఠి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కరుణరత్నే బౌలింగ్ లో దిల్షాన్ మదుశంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ 16, సూర్యకుమార్ యాదవ్ 1 పరుగుతో ఉన్నారు. టీమిండియా స్కోరు ఏడు ఓవర్ల వద్ద 57/2గా ఉంది.
కాగా, తొలి టీ20లో టీమిండి విజయం సాధించగా, రెండో టీ20లో శ్రీలంక గెలిచింది. ఇవాళ గెలిచే జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల అనంతరం వన్డే మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
టీమిండియా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, శివం, ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహెల్.
శ్రీలంక జట్టు: డి.శనక (కెప్టెన్), నిస్సాంకా, మెండీస్, డి సిల్వా, అసలంకా, ఫెర్నాండో, హసరంగా, కరుణరత్నే, తీక్షణ, రాజితా, మదుశంక.