Saina Nehwal : ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ కామెంట్లపై సైనా నెహ్వాల్ కౌంటర్

జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు

Saina Nehwal : ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ కామెంట్లపై సైనా నెహ్వాల్ కౌంటర్

Saina Nehwal

Updated On : August 14, 2024 / 11:00 AM IST

Saina Nehwal : జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు నాకు జావెలిన్ త్రో గురించి తెలిసిందని సైనా నెహ్వాల్ పాడ్‌కాస్ట్ సందర్భంగా చెప్పారు. సైనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెను రాజకీయాల్లో కంగనా రనౌత్ తో పోల్చారు. ‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ అని అభివర్ణించారు. నెటిజన్ల కామెంట్స్ పై తాజాగా సైనా నెహ్వాల్ స్పందించారు.

Also Read : Arshad Nadeem : వివాదంలో పాక్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్.. ఉగ్ర లింకులు ఉన్నాయా?

మీ కంప్లిమెంట్ కు ధన్యవాదాలు. కంగనా అందంగా ఉంది. కానీ నేను నా క్రీడలో పరిపూర్ణంగా ఉండాలి. నేను గర్వంగా నా దేశానికి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం. 1 అయ్యి ఒలింపిక్ పతకాన్ని సాధించాను. మళ్లీ నేను చెబుతున్నాను.. ఇంట్లో కూర్చొని వ్యాఖ్యానించడం చాలా సులభం. కానీ, నీరజ్ మా సూపర్ స్టార్, అతను ఈ క్రీడను భారతదేశంలో బాగా ప్రాచుర్యం కల్పించాడు అని సైనా ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

Also Read : Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో ర‌జ‌తం.. భార‌త్‌కు రానీ నీర‌జ్.. జ‌ర్మ‌నీకి ప‌య‌నం.. ఎందుకంటే..?

సైనా ఇంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా పై వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యారు. క్రికెట్ కంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ శారీరకంగా కష్టంగా ఉంటాయని సైనా వ్యాఖ్యానించారు ఆమె వ్యాఖ్యలపై యువ క్రికెటర్ రఘువంశీ స్పందిస్తూ.. బుమ్రా 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తే సైనా తట్టుకోగలదో లేదో చూడాలి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ తరువాత వెంటనే పోస్టు డిలీట్ చేసినా అది అప్పటికే వైరల్ అయింది. రఘువంశీ పోస్టుపై సైనా స్పందించింది. ఒకవేళ నేనే ఎనిమిదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతూఉంటే బుమ్రా పేస్ కు సమాధానం చెప్పి ఉండేదాన్నేమో. ఒకవేళ బుమ్రా బ్యాడ్మింటన్ ఆడితే నేను కొట్టే స్మాష్ల ను అడ్డుకోవటం కష్టమని నేనంటా అంటూ సైనా పేర్కొంది.