Champions Trophy: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. రోహిత్, పంత్ ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.

Team India
Champions Trophy: ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుంగా.. టీమిండియా ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శనివారం రాత్రి దుబాయ్ చేరుకున్నారు. వారికి దుబాయ్ లో ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.
Also Read: Rohit Sharma : రోహిత్ శర్మకు బిగ్ షాక్.. కెప్టెన్‌గా స్టార్ పేసర్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కోహ్లీతో కూడిన తొలి బృందం దుబాయ్ లో అడుగుపెట్టింది. ఈ బ్యాచ్ లో రోహిత్, కోహ్లీతోపాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ లతోపాటు అసిస్టెంట్ కోచ్ లు ర్యాన్ టెన్ డోస్చెట్, అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా ఉన్నారు. అయితే, మిగిలిన వారు ఆదివారం దుబాయ్ చేరుకోనున్నట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ సహాయక సిబ్బందిని ఏదో అడుగుతున్నట్లు వీడియో ఉంది. బస్సు ఎక్కే సమయంలో బస్సు డోర్ వద్ద రోహిత్ నిలబడి ఉండగా.. సహాయక సిబ్బందిలో ఒక సభ్యుడు అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, అతడికి రోహిత్ ఏదో చెప్పగా.. అతను కాస్త కంగారుగా కనిపించాడు. రోహిత్ ఏదో మర్చిపోగా.. దానికి సంబంధించిన వివరాలను సిబ్బందికి చెబుతున్నట్లు వీడియోను బట్టి అర్ధమవుతుంది.
Did Rohit Sharma forget something, again? 🙂
Team India lands in Dubai. From coach GG to Virat Kohli to Hardik Pandya, everyone boarded the bus together and left tor the hotel. @toisports pic.twitter.com/e6UTSilPha
— Sahil Malhotra (@Sahil_Malhotra1) February 15, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 19న ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దాయాది పాకిస్థాన్ జట్టుతో రోహిత్ సేన తలపడనుంది. మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది. కాగా.. భారత్ జట్టు ప్రస్తుతం అద్భుత ఫాంలో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
📍 Touchdown Dubai! 🛬#TeamIndia have arrived for #ChampionsTrophy 🏆 2025 😎 pic.twitter.com/obWYScvOmw
— BCCI (@BCCI) February 15, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్( వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్); హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.