భారత్ భారీ స్కోర్ : 358/9

భారత్ భారీ స్కోర్ : 358/9

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 4వ వన్డేలో ఆడుతున్న భారత్.. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. 3వ వన్డేలో భారత్‍‌కు భారీ టార్గెట్ ఇచ్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. 9 వికెట్లు నష్టపోయినప్పటికీ 359 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ ముందుంచింది. 

ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఫెయిలవుతోన్న ఓపెనర్లు 30 ఓవర్ల వరకూ క్రీజులో పాతుకుపోవడంతో భారత స్కోరు పరుగులు పెట్టింది. దూకుడుగా ఆడిన భారత్.. 30.6 ఓవర్లకి 193పరుగుల వద్ద రోహిత్ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు)తొలి వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మరో ఓపెనర్ అదే దూకుడును కొనసాగించి 254 పరుగుల వద్ద 37.4వ బంతికి పెవిలియన్ చేరాడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పెట్టుకున్న అంచనాలు నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం 6 బంతుల్లో 7 పరుగులు చేసి 266 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్(26), రిషబ్ పంత్(36), కేదర్ జాదవ్(10), విజయ్ శంకర్(26), భువనేశ్వర్ కుమార్(1), కుల్దీప్ యాదవ్(1), యుజ్వేంద్ర చాహల్(0), బుమ్రా(6) ఓ మాదిరి ప్రదర్శన చేయడంతో భారత్ 359 పరుగులు చేయగలిగింది.