IPL 2020: ప్రాక్టీస్‌లో ధోనీ సిక్సుల వర్షం.. సురేశ్ రైనా విజిల్స్

IPL 2020: ప్రాక్టీస్‌లో ధోనీ సిక్సుల వర్షం.. సురేశ్ రైనా విజిల్స్

Updated On : August 22, 2020 / 5:45 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సురేశ్ రైనాలు ఐదు నిమిషాల విరామంతోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ లు అయిన వీరిద్దరూ అంటే తమిళనాట విపరీతమైన అభిమానం. ఇదిలా ఉంటే ఎన్ని నెలలుగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.



ఈ క్రమంలో లీగ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. రాజస్థాన్ రాయల్స్ లాంటి జట్లు అబుదాబికి చేరుకోగా.. సీఎస్కే మరి కొద్ది రోజుల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెషన్ లో ధోనీ అద్భుత ప్రదర్శనను సీఎస్కే కూడా ట్వీట్ చేసింది. 59సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ధోనీ సిక్సులు ఆకట్టుకుంటున్నాయి.

బ్యాటింగ్ ఫుల్ ఫ్లో లో ఉంది. సీమర్స్, ఫేసర్ల బౌలింగ్ లో సిక్సులు బాది ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. సూపర్ క్యాంప్ ను సూపర్ ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. థ్యాంక్స్ టూ కొవిడ్. చివర్లో పెద్ద విజిల్ తో ముగించామని సీఎస్కే ట్వీట్ చేసింది.



ధోనీ ప్రతి బాల్ ను స్ట్రైక్ చేస్తున్నారు. అన్ని డైరక్షన్లలో సిక్సులు బాదేస్తున్నాడు. ధోనీ మామూలుగానే సెల్ఫ్, రిలాక్స్ డ్, కాన్ఫిడెంట్, హ్యాపీగా కనిపిస్తున్నాడని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చాలా కాలంగా మా ప్లేయర్లంతా ట్రైనింగ్ కు దూరంగా ఉన్నారు. బ్రేక్ తర్వాత వాళ్లు స్ట్రెచ్ అవలేదు. నిదానంగా వాళ్ల రిథమ్ సెట్ చేసుకుంటున్నారు అని సీఎస్కే ట్రైనింగ్ క్యాంప్ గురించి విశ్వనాథన్ అన్నారు.



యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. ఐపీఎల్ రూల్స్ ను బట్టి.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, బీసీసీఐ ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేయలేదు.