IPL 2021 PBKS Vs CSK : రాహుల్ విధ్వంసం… పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టుని పంజాబ్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. స

Ipl 2021 Pbks Vs Csk
IPL 2021 PBKS Vs CSK : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. తన చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై జట్టుని పంజాబ్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సీఎస్కే విధించిన 135 పరుగుల టార్గెట్ ను పంజాబ్ అలవోకగా చేధించింది. 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
Facebook: ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!
పంజాబ్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లోనే 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. రాహుల్ వన్ మ్యాన్ షో తో మరో 7 ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ జయభేరి మోగించింది. ఈ క్రమంలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 6 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్ (55 బంతుల్లో 76 పరుగులు.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. ఒంటరి పోరాటం చేశాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుస షాక్‌లు తగిలాయి. అర్ష్‌దీప్ బౌలింగ్ లో గైక్వాడ్.. షారూక్‌ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటవగా.. తర్వాత వచ్చిన మొయిన్ అలీ డకౌటయ్యాడు. రాబిన్ ఉతప్ప (2), అంబటి రాయుడు(4)లను జోర్డాన్ వరుస ఓవర్లలో ఔట్ చేసి చెన్నైకి గట్టి షాక్ ఇచ్చాడు. కుదురుకుంటున్నట్లు కనిపించిన ధోనీ (12)ని 12వ ఓవర్లో రవి బిష్ణోయ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. జడేజా (15) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జోర్డాన్ రెండు, రవి బిష్ణోయ్, షమీ చెరో వికెట్ తీశారు.
Railway : రైలులో ప్రయాణిస్తే మాస్క్ మస్ట్… మార్గదర్శకాలు పొడిగింపు
ఐపీఎల్ 14వ సీజన్ లో ఇప్పటికే చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరింది. అందరికన్నా ముందే అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే గత రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఇది మూడో ఓటమి. తొలుత రాజస్థాన్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైని ఓడించి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు పంజాబ్ దెబ్బతీసింది. దీంతో ప్లేఆఫ్స్ ముంగిట ధోనీసేనకు మూడు గట్టి దెబ్బలు తగిలాయి.
కాగా, ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ జట్లు ఆడే మ్యాచుల జయాపజయాలపై పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తు ఆధారపడి ఉంది.
స్కోర్లు..
చెన్నై… 134/6
పంజాబ్..139/4(13 ఓవర్లు)