IPL 2021: ఐపిఎల్ 2021కు లైన్ క్లియర్.. మూడు రోజులు ముందే సిపిఎల్!

క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించే విషయంలో అతిపెద్ద అడ్డంకి తొలగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) అభ్యర్థన మేరకు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్‌ను మార్చడానికి క్రికెట్ వెస్టిండీస్ అంగీకరించింది.

IPL 2021: ఐపిఎల్ 2021కు లైన్ క్లియర్.. మూడు రోజులు ముందే సిపిఎల్!

Cpl (1)

IPL 2021 Phase 2: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించే విషయంలో అతిపెద్ద అడ్డంకి తొలగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) అభ్యర్థన మేరకు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్‌ను మార్చడానికి క్రికెట్ వెస్టిండీస్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో బిసిసిఐ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపిఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లను సులభంగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది.

ఐపిఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్-అక్టోబర్‌లో UAEలో ఆడనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. బోర్డు ఇంకా దాని తేదీలను ప్రకటించనప్పటికీ, ఐపిఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుండి జరుగుతాయని ఇప్పటికే రిపోర్ట్‌లు వచ్చాయి. కానీ దీని కోసం కరేబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

వాస్తవానికి, CPL రాబోయే సీజన్ ఆగస్ట్ 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. కానీ సెప్టెంబర్ 19కి ముందు క్రికెట్ వెస్టిండీస్ సిపిఎల్‌ను ముగించాలని భారత బోర్డు కోరింది. ఐపిఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌ల తేదీలను అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించకపోవడానికి కారణం కూడా సీపీఎల్‌యే. దీనికి సంబంధించి CPL CEO పీట్ రస్సెల్‌తో BCCI కార్యదర్శి జే షా చర్చించిన అనంతరం షెడ్యూల్ మార్చబడింది. ఇప్పుడు సిపిఎల్ మూడు రోజుల ముందు ప్రారంభం అవుతుంది. రాబోయే సిపిఎల్ సీజన్ ఆగస్టు 25నుంచి సెప్టెంబర్ 15 మధ్య జరుగుతుంది.