IPL 2022: వేలం తర్వాత లక్నో జట్టు పూర్తి వివరాలివే
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు సిద్ధమైనట్లే.

Lsg
IPL 2022: రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు సిద్ధమైనట్లే.
15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. వేలంలో ఇషాన్ కిషన్ రూ.15.25కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ రూ.14కోట్లుకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కంటే ఎక్కువ ధర పలికాడు. విదేశీ ప్లేయర్లలో లియామ్ లివింగ్ స్టోన్ కోసం రూ.11.50కోట్ల వరకూ వెచ్చించి కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
Lucknow Super Giants
అవేష్ ఖాన్ (రూ. 10 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 6.75 కోట్లు), జాసన్ హోల్డర్ (రూ. 8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (రూ. 8.25 కోట్లు), మార్క్ వుడ్ (రూ. 7.50 కోట్లు), దీపక్ హుడా (రూ. 5.75 కోట్లు), మనీష్ పాండే (4.60 కోట్లు), దుష్మంత చమీర (రూ. 2 కోట్లు), ఎవిన్ లూయిస్ (రూ. 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (రూ. 90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పూత్ (రూ. 50 లక్షలు), షాబాజ్ నదీమ్ (రూ. 50 లక్షలు), కైల్ మేయర్స్ (రూ. 50 లక్షలు), మనన్ వోహ్రా (రూ. 20 లక్షలు), మొహ్సిన్ ఖాన్ (రూ. 20 లక్షలు), మయాంక్ యాదవ్ (రూ. 20 లక్షలు), ఆయుష్ బదోని (రూ. 20 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 20 లక్షలు).
Read Also: వేలం తర్వాత చెన్నై పూర్తి జట్టు వివరాలివే
అంటిపెట్టుకున్న ప్లేయర్లు:
కేఎల్ రాహుల్ (రూ. 15 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు).
మొత్తం జట్టు: 21మంది, విదేశీ ప్లేయర్లు 7మంది