IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా అజిత్ అగార్కర్
టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ను అసిస్టెంట్ కోచ్ నియమించింది ఢిల్లీ క్యాపిటల్స్. మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2022కు ముందు ఢిల్లీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Ajit Agarkar
IPL 2022: టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ను అసిస్టెంట్ కోచ్ నియమించింది ఢిల్లీ క్యాపిటల్స్. మరి కొద్ది వారాల్లో మొదలుకానున్న ఐపీఎల్ 2022కు ముందు ఢిల్లీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 24తో శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లలో అగార్కర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తారు. ఆ సిరీస్ ముగించుకుని ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ గా సేవలు అందించేందుకు వెళ్లనున్నారు.
‘ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని అగార్కర్ వెల్లడించాడు. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభం అవుతుందని వార్తలు వస్తుండగా అధికారికంగా తేదీ అనౌన్స్ కాలేదు.
‘డిఫరెంట్ కెపాసిటీతో రిటర్న్ అవుతున్నందుకు సంతోషంగా ఉన్నా. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. రిషబ్ పంత్ జట్టులో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. కోచ్ రిక్కీ పాంటింగ్ క్రికెట్ లో ఒక లెజెండ్. అతనితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. జట్టుతో కలిసి ప్రయాణించి కొన్ని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా’ అని అగార్కర్ అంటున్నారు.
Read Also: U19 విన్నింగ్ కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
అగార్కర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 288 వన్డేలు, 58టెస్టు వికెట్లు ఉండగా.. ఐపీఎల్ లో ప్లేయర్ గా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో రిక్కీ పాంటింగ్ అసిస్టెంటె కోచ్ లైన ప్రవీణ్ ఆమ్రె, జేమ్స్ హోప్స్ తో పాటు అజిత్ అగార్కర్ కూడా చేరనున్నాడు.