IPL 2022 : ఆర్సీబీకి ఇక పండుగే.. ‘కొత్త పెళ్లికొడుకు’ మాక్సీ వస్తున్నాడుగా…!
IPL 2022 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసీస్ సూపర్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వస్తున్నాడు.

Ipl 2022 Good News For Rcb ; Glenn Maxwell Enroute To India, Posts Ticket Photo On Instagram
IPL 2022 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసీస్ సూపర్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వస్తున్నాడు. ఇటీవలే ఓ ఇంటి వాడైన మాక్సీ అతి త్వరలో ఐపీఎల్ టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ జట్టు ఆర్సీబీలో కలిసేందుకు భారత్ రానున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్ పిరియడ్‌లో ఉన్న ఈ కొత్త పెళ్లి కొడుకు.. అది పూర్తి అయిన వెంటేనే ఆర్సీబీతో కలవనున్నాడు. మాక్సీ భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను మార్చి 18న పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ముందుగా వినీ రామన్ కుటుంబం ఆచార సంప్రదాయం ప్రకారం మాక్సీ పెళ్లి వేడుక జరిగింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో వినీని మాక్సీ పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్ కూడా మొదలు కావడంతో ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యాడు. వివాహం అనంతరం చేయాల్సిన సంప్రదాయపరమైన పనులన్నీ పూర్తి చేసుకున్నాడు.

Ipl 2022 Good News For Rcb ; Glenn Maxwell Enroute To India, Posts Ticket Photo On Instagram
భారత్ వచ్చేందుకు మాక్సీ రెడీ అవుతున్నాడు. మాక్స్ వెల్ తాను వస్తున్నట్టుగా ముందుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు. తన పాస్ పోర్టు, విమాన టికెట్ల ఫొటోలను తన సోషల్ అకౌంట్లో షేర్ చేశాడు. అంతేకాదు.. సతీమణి వినీతో కలిసి భారత్ రానున్నట్టు చెప్పకనే చెప్పేశాడు తమిళనాడు అల్లుడు.
ఆర్సీబీ విధ్వంసకర ప్లేయర్ గెల్ మాక్స్ వెల్ వస్తున్నాడనే హింట్ ఇవ్వడంతో బెంగళూరు అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ జట్టుకు మాక్స్ వెల్ బ్యాక్ బోన్ లాంటివాడు. మాక్సీ రాకతో జట్టులో మరింత బలం చేకూరనుంది. ఐపీఎల్ ఆరంభ టోర్నీలో బెంగళూరు మాక్సీ లేకుండానే బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసింది. అయితే రెండో మ్యాచ్ ఆడి కోల్ కతాపై విజయం సాధించింది. ఏప్రిల్ 5న రాజస్తాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
Read Also : IPL 2022: టీమిండియాకు ఆడదగ్గ ప్లేయర్ అంటూ రవిశాస్త్రి కామెంట్లు