IPL 2023, RR vs GT: హార్దిక్ పాండ్యా దూకుడు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఘన విజయం సాధించింది.

RR vs GT
IPL 2023, RR vs GT: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది
LIVE NEWS & UPDATES
-
గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(41 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు), శుభ్‌మన్ గిల్(36; 35 బంతుల్లో 6 ఫోర్లు) రాణించగా హార్ధిక్ పాండ్యా(39 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోరు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ ఓ వికెట్ తీశాడు.
-
8 పరుగులు
13వ ఓవర్‌ను అశ్విన్ వేయగా 8 పరుగులు వచ్చాయి. మూడో బంతికి పాండ్యా ఫోర్ కొట్టాడు. 13 ఓవర్లకు గుజరాత్ స్కోరు 114/1. హార్దిక్ పాండ్య(37), వృద్ధిమాన్ సాహా(38) క్రీజులో ఉన్నారు.
-
పాండ్యా ఫోర్
12వ ఓవర్‌ను చాహల్ వేయగా 10 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి పాండ్యా ఫోర్ కొట్టాడు. 12 ఓవర్లకు గుజరాత్ స్కోరు 106/1. హార్దిక్ పాండ్య(31), వృద్ధిమాన్ సాహా(36) క్రీజులో ఉన్నారు.
-
24 పరుగులు
హార్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే దూకుడుగా ఆడుతున్నాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో వరుసగా 6,4,6,6 కొట్టడంతో ఈ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు గుజరాత్ స్కోరు 96/1. హార్దిక్ పాండ్య(24), వృద్ధిమాన్ సాహా(33) క్రీజులో ఉన్నారు.
-
గిల్ ఔట్
చాహల్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(36) స్టంపౌట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 71 పరుగుల(9.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 72/1. హార్దిక్ పాండ్య(1), వృద్ధిమాన్ సాహా(32) క్రీజులో ఉన్నారు.
-
గిల్ ఫోర్
తొమ్మిదో ఓవర్‌ను ఆడమ్ జంపా వేయగా 8 పరుగులు వచ్చాయి. మూడో బంతికి గిల్ ఫోర్ కొట్టాడు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోరు 69/0. వృద్ధిమాన్ సాహా(31), శుభ్‌మన్ గిల్(35) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
ఎనిమిదవ ఓవర్‌ను చాహల్ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులే వచ్చాయి. 8 ఓవర్లకు గుజరాత్ స్కోరు 61/0. వృద్ధిమాన్ సాహా(28), శుభ్‌మన్ గిల్(30) క్రీజులో ఉన్నారు.
-
8 పరుగులు
ఏడో ఓవర్‌ను ఆడమ్ జంపా వేయగా 8 పరుగులు వచ్చాయి. మూడో బంతికి గిల్ ఫోర్ కొట్టాడు. 7 ఓవర్లకు గుజరాత్ స్కోరు 57/0. వృద్ధిమాన్ సాహా(27), శుభ్‌మన్ గిల్(27) క్రీజులో ఉన్నారు.
-
గిల్ రెండు ఫోర్లు
ఆరో ఓవర్‌ను సందీప్ శర్మ వేయగా గిల్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు గుజరాత్ స్కోరు 49/0. వృద్ధిమాన్ సాహా(25), శుభ్‌మన్ గిల్(21) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఫోర్లు
ఐదో ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. తొలి బంతికి గిల్ ఫోర్ కొట్టగా, నాలుగు, ఐదు బంతులకు సాహా బౌండరీలు బాదడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 39/0. వృద్ధిమాన్ సాహా(24), శుభ్‌మన్ గిల్(13) క్రీజులో ఉన్నారు.
-
సాహా ఫోర్
నాలుగో ఓవర్‌ను సందీప్ శర్మ వేయగా ఆఖరి బంతికి సాహా ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 9 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు గుజరాత్ స్కోరు 25/0. వృద్ధిమాన్ సాహా(15), శుభ్‌మన్ గిల్(8) క్రీజులో ఉన్నారు.
-
గిల్ ఫోర్
మూడో ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. మూడో బంతికి గిల్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 5 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 16/0. వృద్ధిమాన్ సాహా(10), శుభ్‌మన్ గిల్(6) క్రీజులో ఉన్నారు.
-
2 పరుగులు
రెండో ఓవర్‌ను సందీప్ శర్మ కట్టుదిట్టంగా వేయడంతో రెండు పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు గుజరాత్ స్కోరు 11/0. వృద్ధిమాన్ సాహా(9), శుభ్‌మన్ గిల్(1) క్రీజులో ఉన్నారు.
-
సాహా రెండు ఫోర్లు
లక్ష్య ఛేదనకు గుజరాత్ దిగింది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేయగా సాహా రెండు ఫోర్లు కొట్టాడు. 1 ఓవర్‌కు గుజరాత్ స్కోరు 9/0. వృద్ధిమాన్ సాహా(9), శుభ్‌మన్ గిల్(0) క్రీజులో ఉన్నారు.
-
గుజరాత్ లక్ష్యం 119
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌలైంది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్(30; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించగా మిగిలిన వారిలో ట్రెంట్ బౌల్ట్ 15, జైశ్వాల్ 14, పడిక్కల్ 12 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా షమీ, హార్దిక్ పాండ్యా, జాషువా లిటిల్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
-
ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్
రాజస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 112 పరుగుల(16.3వ ఓవర్) వద్ద రాజస్థాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 113/9. సందీప్ శర్మ(0), ఆడమ్ జంపా(4) క్రీజులో ఉన్నారు.
-
ట్రెంట్ బౌల్ట్ సిక్స్
16వ ఓవర్ ను నూర్ అహ్మద్ వేశాడు. మూడో బంతికి ట్రెంట్ బౌల్ట్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తంగా 10 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 110/8. ట్రెంట్ బౌల్ట్(14), ఆడమ్ జంపా(3) క్రీజులో ఉన్నారు.
-
షిమ్రాన్ హెట్మెయర్ ఔట్
రాజస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో ఎల్భీగా షిమ్రాన్ హెట్మెయర్(7) ఔట్ అయ్యాడు. దీంతో 96 పరుగుల(14.1వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 100/8. ట్రెంట్ బౌల్ట్(7), ఆడమ్ జంపా(2) క్రీజులో ఉన్నారు.
-
ధ్రువ్ జురెల్ ఔట్
రాజస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్భీగా ధ్రువ్ జురెల్(9) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 87 పరుగుల(13.1వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 96/7. ట్రెంట్ బౌల్ట్(6), షిమ్రాన్ హెట్మెయర్(7) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
13వ ఓవర్‌ను జాషువా లిటిల్ వేశాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 87/6. ధ్రువ్ జురెల్(9), షిమ్రాన్ హెట్మెయర్(5) క్రీజులో ఉన్నారు.
-
పడిక్కల్ క్లీన్ బౌల్డ్
నూర్ అహ్మద్ బౌలింగ్‌లో దేవదత్ పడిక్కల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 77 పరుగుల(11.3వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 82/6. ధ్రువ్ జురెల్(5), షిమ్రాన్ హెట్మెయర్(4) క్రీజులో ఉన్నారు.
-
నాలుగు పరుగులు
పదకొండో ఓవర్‌ను జాషువా లిటిల్ వేశాడు. ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 76/5. దేవదత్ పడిక్కల్(12), షిమ్రాన్ హెట్మెయర్(3) క్రీజులో ఉన్నారు.
-
పరాగ్ ఔట్
రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇంఫాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రియాన్ పరాగ్(4) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో 69 పరుగుల(9.2వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 72/5. దేవదత్ పడిక్కల్(10), షిమ్రాన్ హెట్మెయర్(1) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
తొమ్మిదో ఓవర్‌ను జాషువా లిటిల్ వేశాడు. ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 67/4. దేవదత్ పడిక్కల్(9), రియాన్ పరాగ్ (2) క్రీజులో ఉన్నారు.
-
అశ్విన్ క్లీన్ బౌల్డ్
ఎనిమిదో ఓవర్‌ను రషీద్ ఖాన్ వేశాడు. ఆఖరి బంతికి రవిచంద్రన్ అశ్విన్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 63/4. దేవదత్ పడిక్కల్(6), రియాన్ పరాగ్ (0) క్రీజులో ఉన్నారు.
-
శాంసన్ ఔట్
దూకుడుగా ఆడుతున్న శాంసన్(30) ఔట్ అయ్యాడు. జాషువా లిటిల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో 60 పరుగుల(6.5వ ఓవర్) వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 61/3. దేవదత్ పడిక్కల్(6), రవిచంద్రన్ అశ్విన్(1) క్రీజులో ఉన్నారు.
-
జైస్వాల్ రనౌట్
సమన్వయ లోపం కారణంగా జైస్వాల్(14) రనౌట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో శాంసన్ షాట్ ఆడగా బంతిని ఫీల్డర్ ఆపాడు. శాంసన్ పరుగు వద్దు అని చెప్పేలోపే జైస్వాల్ క్రీజును వదిలి చాలా దూరం వచ్చేశాడు. దీంతో గుజరాత్ సింపుల్‌గా రెండో వికెట్(5.1వ ఓవర్ వద్ద) పడగొట్టింది. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 50/2. దేవదత్ పడిక్కల్(1), సంజుశాంసన్(25)క్రీజులో ఉన్నారు.
-
9 పరుగులు
ఐదో ఓవర్‌ను షమీ వేశాడు. తొలి బంతికి సంజు శాంసన్ ఫోర్ కొట్టగా మొత్తంగా 9 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 47/1. యశస్వి జైస్వాల్(14), సంజుశాంసన్(23)క్రీజులో ఉన్నారు.
-
శాంసన్ ఫోర్, సిక్స్
నాలుగో ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన శాంసన్ రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 38/1. యశస్వి జైస్వాల్(14), సంజుశాంసన్(14)క్రీజులో ఉన్నారు.
-
జైస్వాల్ సిక్స్, ఫోర్
మూడో ఓవర్‌ను షమీ వేశాడు. మూడో బంతికి సిక్స్ కొట్టిన జైస్వాల్ ఐదో బంతికి ఫోర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 25/1. యశస్వి జైస్వాల్(13), సంజుశాంసన్(2)క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ ఔట్
హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన బట్లర్(8) మరో షాట్‌కు యత్నించి మోహిత్ శర్మ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ 11 పరుగుల(1.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 12/1. యశస్వి జైస్వాల్(1), సంజుశాంసన్(1)క్రీజులో ఉన్నారు.
-
రెండు పరుగులు
టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్లు ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్‌ను మహమ్మద్ షమీ వేశాడు. 1 ఓవర్‌ను రాజస్థాన్ స్కోరు 2/0. యశస్వి జైస్వాల్(1), జోస్ బట్లర్(0) క్రీజులో ఉన్నారు.
-
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్
-
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
-
టాస్ గెలిచిన రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.