KKR vs RCB : బెంగ‌ళూరు పై కోల్‌క‌తా విజ‌యం

కోల్‌క‌తా వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ్డాయి.

KKR vs RCB : బెంగ‌ళూరు పై కోల్‌క‌తా విజ‌యం

screengrab from video posted on x by@IPL

కోల్‌క‌తా విజ‌యం
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఉత్కంఠ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యాన్ని సాధించింది. 223 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

విల్ జాక్స్ హాఫ్ సెంచ‌రీ..
వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 29 బంతుల్లో విల్ జాక్స్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 9 ఓవ‌ర్ల‌లో ఆర్‌సీబీ స్కోరు 100/2. విల్ జాక్స్ (53), ర‌జ‌త్ పాటిదార్ (17)లు క్రీజులో ఉన్నారు.

డుప్లెసిస్ ఔట్‌..
బెంగ‌ళూరు మ‌రో వికెట్ కోల్పోయింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఫాప్ డుప్లెసిస్ (7) ఔట్ అయ్యాడు. దీంతో 3.1వ ఓవ‌ర్‌లో 35 ప‌రుగుల వ‌ద్ద బెంగ‌ళూరు రెండో వికెట్ కోల్పోయింది.

కోహ్లి ఔట్‌.. 
ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆర్‌సీబీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (18 7 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 2.1వ ఓవ‌ర్‌లో 27 ప‌రుగుల వ‌ద్ద ఆర్‌సీబీ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఆర్‌సీబీ టార్గెట్ 223
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 36 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఫిల్ సాల్ట్ (48; 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్‌, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, లాకీ ఫెర్గూస‌న్ చెరో వికెట్ సాధించారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ
య‌శ్ ద‌యాల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 35 బంతుల్లో కోల్‌క‌తా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 177/5 శ్రేయ‌స్ అయ్య‌ర్ (50), ఆండ్రీ ర‌స్సెల్ (11) లు క్రీజులో ఉన్నారు.

రింకూ సింగ్ ఔట్‌.. 
ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో య‌శ్ ద‌యాల్ క్యాచ్ అందుకోవ‌డంతో రింకూ సింగ్ (24; 16బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 13.1 ఓవ‌ర్‌లో 137 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా ఐదో వికెట్ కోల్పోయింది.

10 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోరు 107/4
కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా నాలుగు వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగులు చేసింది. క్రీజులో శ్రేయ‌స్ అయ్య‌ర్ (18), రింకూ సింగ్ (7) లు ఉన్నారు. అంత‌క‌ముందు కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ (16) ఔట్ అయ్యాడు.

ర‌ఘువంశీ ఔట్‌..
ఒకే ఓవ‌ర్‌లో కోల్‌క‌తా రెండు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవ‌ర్‌ను య‌శ్ ద‌యాల్ వేశాడు. రెండో బంతికి సునీల్ న‌రైన్ ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి గ్రీన్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో ర‌ఘువంశీ (3) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 75/3. వెంక‌టేశ్ అయ్య‌ర్ (9), శ్రేయ‌స్ అయ్య‌ర్ (0) లు క్రీజులో ఉన్నారు.

సునీల్ న‌రైన్ ఔట్‌..
కేకేఆర్ మ‌రో వికెట్ కోల్పోయింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న సునీల్ న‌రైన్ (10) య‌శ్ ద‌యాల్ బౌలింగ్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 5.2 ఓవ‌ర్ల‌లో 66 ప‌రుగుల వ‌ద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది.

ఫిల్‌ సాల్ట్ ఔట్‌..
దూకుడుగా ఆడుతున్న ఫిల్‌ సాల్ట్ (48; 14 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స‌ర్లు)ఔట్ అయ్యాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో ర‌జ‌త్ పాటిదార్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో కేకేఆర్ 4.2 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు : ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్


కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. కోల్‌క‌తా వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డుతోంది. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే బెంగ‌ళూరు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన బెంగ‌ళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌క‌తా బ్యాటింగ్ చేయ‌నుంది.