IPL 2024 players auction : ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం రంగం సిద్దమవుతోంది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న వేలంను నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది.

IPL 2024 players auction
IPL 2024 auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం రంగం సిద్దమవుతోంది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న వేలంను నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్లు కూడా తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్లతో పాటు విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 26 వరకు సమయం ఇచ్చారు. ఈ వివరాలను ఐపీఎల్ కమిటీకి అందించాలి. కాగా.. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలాన్ని దేశంలోనే నిర్వహించగా మొదటి సారి బయట నిర్వహిస్తున్నారు.
ఏ ప్రాంఛైజీ వద్ద ఎంత నగదు ఉందో చూద్దాం..
మొత్తం పది జట్లలో పంజాబ్ వద్ద అత్యధికంగా రూ.12.20కోట్లు ఉన్నాయి. అందరికంటే తక్కువగా ముంబై వద్ద రూ.50లక్షలు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్- రూ.12.20 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 6.55 కోట్లు
గుజరాత్ టైటాన్స్ – రూ.4.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్- రూ.4.45 కోట్లు
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నేపాల్, ఒమన్.. ఇక మిగిలింది రెండే..
లక్నో సూపర్ జెయింట్స్- రూ.3.55 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ – రూ.3.35 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.1.75 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.1.65 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ – రూ.1.5 కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ.50 లక్షలు
ఇదిలా ఉంటే.. ఈ సారి వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీ పర్స్ విలువ పై రూ.5 కోట్లు పెంచాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో ప్రాంఛైజీల పర్స్ వాల్యూ రూ.95 కోట్లుగా ఉండేది. ఇప్పుడు రూ.5 కోట్లు పెరిగితే రూ.100 కోట్లకు చేరుకుంటుంది. అయితే.. దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వేలం నాటికి దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
ODI World Cup 2023 : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల ఆన్ ఫీల్డ్ ప్రేమ.. మీమ్స్ వైరల్