IPL 2025 : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో ఛేజింగ్ చేసిన జట్లదే గెలుపు..
గతంలో అహ్మదాబాద్ వేదికగా మూడు ఫైనల్స్ జరిగాయి. ఆ మూడింటిలో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.

Modi Stadium
IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇవాళ్టితో తెరపడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.
లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు.. ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి.
గతంలో అహ్మదాబాద్ వేదికగా మూడు ఫైనల్స్ జరిగాయి. ఆ మూడింటిలో ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఐపీఎల్ 2023 ఫైనల్ లో ఛేజింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఇక 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే జరిగింది. ఇందులో లక్ష్యాన్ని చేధించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2024 ఐపీఎల్ ఫైనల్ లోనూ అదే ఫలితం. తుది పోరులో ఛేజింగ్ చేసిన కేకేఆర్ విజయం సాధించి టైటిట్ ను నెగ్గింది.
అహ్మదాబాద్ లో ఫైనల్స్ లో ఛేజింగ్ చేసిన జట్లదే విజయం..
2023 – గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
2023 – వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ పై 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
2024 – సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో గెలుపు కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ