DC vs LSG: విశాఖ మ్యాచుకు కేఎల్ రాహుల్ దూరం.. మ్యాచు గురించి అక్షర్ పటేల్ ఆసక్తికర కామెంట్స్
తాము ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని చెప్పాడు.

PIC: @IPL X
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేస్తామని అన్నాడు. మైదానంలో మంచు బిందువుల ప్రభావం ఉందని, దీంతో తాము ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని, అందుకే తాము ముందుగా బౌలింగ్ చేస్తున్నామని తెలిపాడు.
తాను పంత్‌తో కలిసి గతంలో ఆడానని, తన గరించి అతడికి, పంత్ గురించి తనకు అన్ని విషయాలు తెలుసని అక్షర్ పటేల్ చెప్పాడు. ఎవరి ట్రిక్‌లు వారికి ఉంటాయన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాలా మ్యాచులు ఆడానని అన్నాడు. తాను మూడు సంవత్సరాలగా డీసీలో ఉన్నానని తెలిపాడు. తాను ఓ సారథిగా ఆలోచించాలని అన్నాడు. తమ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్, స్టబ్స్, స్టార్క్, ఫ్రేజర్-మెక్‌గుర్క్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.
విశాఖ మ్యాచులో లక్నో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో ఆమె వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్