KKR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2025లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది.

IPL 2025
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 2025లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది. టాస్ 7 గంటలకు కాకుండా కాస్త ఆలస్యంగా వేశారు.
టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచుకి ముందు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ.. ఆర్సీబీకి సారథ్య బాధ్యతలు వహించడం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పాడు. ఈ గ్రౌండ్, ఇక్కడి ఫ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. తన టీమ్ ఆటగాళ్లు పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలిపాడు.
తాము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని రజత్ పటీదార్ చెప్పాడు. తాము గత 10-15 రోజులుగా ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నామని చెప్పాడు.
కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె మాట్లాడుతూ.. ఈడెన్ గార్డెన్స్ లో మళ్లీ ఆడేందుకు సిద్ధమయ్యామని అన్నాడు. ఈ జట్టుకు సారథ్యం వహించడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నానని చెప్పాడు. తమ జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లను నేటి మ్యాచ్‌కు తీసుకున్నామని తెలిపాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: క్వింటన్ డి కాక్, వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్‌లు: అన్రిచ్, మనీశ్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, అభినందన్ సింగ్, మనోజ్ భాండాగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్