LSG vs RCB : సంచలన ఇన్నింగ్స్ ఆడిన జితేశ్‌శర్మను మన్కడింగ్ చేసే ప్రయత్నం.. యువ బౌలర్ పై కోహ్లీ ఆగ్రహం చూశారా? వీడియో..
లక్నో బౌలర్ దిగ్వేశ్ రాఠి ఆర్‌సీబీ బ్యాటర్ జితేశ్ శర్మను మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు.

IPL 2025 LSG vs RCB Virat Kohli angry on Digvesh Rathi As He Mankads Jitesh Sharma
మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కి చేరుకుంది. మే 29న క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో227 పరుగులు సాధించింది. కెప్టెన్ రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఆతరువాత లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో కెప్టెన్ జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌కు తోడు విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా రాణించారు.
మన్కడింగ్ చేసినా..
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో లక్నో బౌలర్ దిగ్వేశ్ రాఠి ఆర్‌సీబీ బ్యాటర్ జితేశ్ శర్మను మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి మయాంక్ అగ్వరాల్ బ్యాటింగ్ చేస్తుండగా జితేశ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. దిగ్వేశ్ రతి బంతిని వేసే క్రమంలో ఆగిపోయి బెయిల్స్‌ను పడగొట్టాడు. అప్పటికే జితేశ్ క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. దిగ్వేశ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సాయం కోరాడు.
పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే.. ఈ లోపే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తమ జట్టు అప్పీల్‌ను వెన్కకి తీసుకుని క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) May 27, 2025
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంత్ అప్పీల్‌ను ఉపసంహరించుకోవాలని కోరిన తరువాత జితేశ్ అతడిని కౌగిలించుకున్నాడు. ఇక దీన్ని అంతటి డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూసిన విరాట్ కోహ్లీ తొలుత దిగ్వేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంత్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో రిలాక్స్ అయ్యాడు.