LSG vs RCB : లక్నో పై సంచలన విజయం.. కోహ్లీ కాదు.. క్రెడిట్ మొత్తం అతడిదే.. ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ షాకింగ్ కామెంట్స్..
లక్నో పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అ

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. మంగళవారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్-2లోకి దూసుకువెళ్లింది. క్వాలిఫయర్-1లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. 29న ముల్లన్‌పూర్‌లో జరగనున్న క్వాలిఫైయర్ 1లో టేబుల్ టాపర్ అయిన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. రిషభ్ పంత్ (118 నాటౌట్; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో227 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో తుషారా, భువనేశ్వర్, షపర్డ్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం జితేశ్ శర్మ (85 నాటౌట్; 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌కు తోడు విరాట్ కోహ్లీ (54; 30 బంతుల్లో 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే రెండు వికెట్లు తీయగా, ఆకాష్ మహారాజ్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
లక్నో పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. ప్రస్తుతం తన ఆలోచనలను ఎలా వ్యక్త పరచాలో అర్థం కావడం లేదన్నాడు. తాను ఎప్పుడూ వర్తమానంలో ఉండాలనే ఆలోచనలో ఉంటానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔటైన తరువాత మ్యాచ్‌ను సాధ్యమైనంత మేర చివరి వరకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. తమ మెంటార్ దినేశ్ కార్తీక్ కూడా తనకు ఇదే విషయం చెప్పాడని అన్నాడు. ఇక తన సామర్థ్యం పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణిస్తూ ఆటను ముగించగలను అని చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహించడం వల్ల కలిగే ఒత్తిడిని తాను ఆస్వాదిస్తున్నానని జితేష్ శర్మ అన్నాడు. ‘ఇది చాలా పెద్ద ఫ్రాంచైజీ. నేను ఒత్తిడిని ఆస్వాదిస్తున్నాను. నేను ఈ ఆటగాళ్లను (విరాట్, కృనాల్, భువీ వంటివారు) చూసినప్పుడు నేను ఈ ఆటగాళ్లతో ఆడటం నాకు సంతోషంగా అనిపిస్తుంది. మేము ఈ క్షణాన్ని ఆస్వాదిస్తాము. ఈ ఆటలో మనకు ఏ ఊపు వచ్చినా, మేము దానిని (తదుపరి ఆటలోకి) ముందుకు తీసుకెళ్తాము.’ అని జితేశ్ అన్నాడు.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్రత్యర్థి గ్రౌండ్లలో మంచి రికార్డును కలిగి ఉంది. ఈ సీజన్‌లో ప్రత్యర్థి మైదానంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ విజయాల్లో రజత్ పాటిదార్ పాత్రను జితేశ్ శర్మ ప్రసంసించాడు. ఆర్‌సీబీలో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లేనని, వారికి తమపై తాము చాలా నమ్మకం ఉందన్నాడు.
‘నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు (ఈ సీజన్‌లో ఇంటి బయట గెలిచిన అద్భుతమైన రికార్డును కొనసాగించడం) రజత్‌కు క్రెడిట్ దక్కుతుంది. హేజిల్‌వుడ్ ఫిట్‌గా ఉన్నాడు. మా జట్టులో నమ్మకమైన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. మీరు ఏ ఆటగాళ్లను చూసినా.. అందరూ మ్యాచ్ విన్నర్లే. మ్యాచ్‌లో మేము 3-4 వికెట్లు కోల్పోయినా కూడా ఎప్పుడూ ఆందోళన చెందము.’ అని జితేశ్ చెప్పుకొచ్చాడు.