Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో ప్రపంచంలోనే ఒకే ఒక్కడు.. దీన్ని టచ్ చేసే ఆటగాడే లేడు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Courtesy BCCI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 24 పరుగుల వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌టీ20తో కలిపి కోహ్లీ ఆర్‌సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు.
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ ముంబై తరుపున 6060 రన్స్ చేశాడు. ఆ తరువాత వరుసగా జేమ్స్ విన్స్, సురేశ్ రైనా, ధోని తదితరులు ఉన్నారు.
ఇక లక్నోతో మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ) – 9030 పరుగులు
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులు
జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 5934 పరుగులు
సురేశ్ రైనా (సీఎస్‌కే) – 5529 పరుగులు
ఎంఎస్ ధోని (సీఎస్‌కే) – 5314 పరుగులు
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా..
ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ కోహ్లీ 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వరుసగా మూడో సారి ఈ ఘనత అందుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇలా ఓ సీజన్‌లో 600 రన్స్ చేయడం ఇది ఐదో సారి. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – 5 సార్లు (2013, 2016, 2023, 2024, 2025)
కేఎల్ రాహుల్ – 4 సార్లు (2018, 2020, 2021, 2022)
క్రిస్ గేల్ – 3 సార్లు (2011, 2012, 2013)
డేవిడ్ వార్నర్ – 3 సార్లు (2016, 2017, 2019)
ఐపీఎల్ 2025 సీజన్‌లో కోహ్లీ 60.20 సగటు 147.91 స్ట్రైక్‌రేటుతో 602 పరుగులు చేశాడు.