IPL 2025 : ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై లక్నో గెలుపు..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

IPL 2025 : ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై లక్నో గెలుపు..

Courtesy BCCI

Updated On : April 20, 2025 / 12:10 AM IST

IPL 2025 : రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ పోరులో లక్నో విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో రాజస్థాన్ ను చిత్తు చేసింది. 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

Also Read : ఓపెనింగ్‌లో మొనగాడిలా ఆడాడు, చివర్లో పసివాడిలా మారాడు.. ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

చివరి ఓవర్ లో రాజస్థాన్ 9 పరుగులు చేయాల్సి ఉండగా అవేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో లక్నో 2 పరుగులు తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైస్వాల్ (74), పరాగ్(39) పోరాటం వృథా అయ్యింది.

ఈ సీజన్ లో లక్నోకు ఇది 5వ గెలుపు ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన లక్నో మూడింటిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 4వ స్థానానికి వచ్చింది. అటు రాజస్థాన్ రాయల్స్ కు పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. రాజస్థాన్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన ఆర్ఆర్ కేవలం రెండు విజయాలే నమోదు చేసింది. వరుస పరాజయాలతో పాయింట్ల టేబుల్ లో 8వ స్థానంలో ఉంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here